–కేజీబీవీ సందర్శనలో కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
Komati Reddy Raj Gopal Reddy: ప్రజా దీవెన, మర్రిగూడ: మునుగో డు నియోజకవర్గ మర్రిగూడ మండ ల కేంద్రంలోని కస్తూరిబా బాలికల పాఠశాలను సందర్శించి అక్కడి సమస్యలను అడిగి తెలుసుకు న్నారు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి . కేజీబీవీ సందర్శనకు వెళ్లిన ఎమ్మె ల్యే కు ఘన స్వాగతం పలికారు సిబ్బంది విద్యార్థినులు. కస్తూరిబా పాఠశాల తరగతి గదులను, డార్మె టరీ హాళ్లను పరిశీలించారు.
కస్తూ రిబా బాలికల పాఠశాలలో విద్యా ర్థినులకు సరిపడా తరగతి గదులు లేవని, డార్మెటరీ హల్లు సరిపోడం లేదని, డ్రైనేజీ సమస్య ఉందని, ప్రత్యేకంగా ట్రాన్స్ఫార్మర్ లేకపో వడం వల్ల విద్యుత్ సమస్య ఉంద నిఎమ్మెల్యే దృష్టికి సిబ్బంది తీసుకొ చ్చారు. అదేవిధంగా గత 25 రోజు లుగా కేజీబీవీ అధ్యాపకులు సమ్మె చేస్తున్న విషయాన్ని ఎమ్మెల్యే దృష్టి కి తీసుకెళ్లగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
ఇటీవల ప్రభుత్వం పెంచిన కాస్మో టిక్ చార్జీలు కేజీబీవీలకు రావడం లేదని తెలుపగా ఇటీవల ప్రభు త్వం పెంచిన మెస్ చార్జీలు కాస్మో టిక్ చార్జీలు కేజీబీవీలకు అందేలా చూస్తానన్నారు. కేజీబీవీలో ఉన్న సమస్యలను, విద్యార్థినులు ఎదు ర్కొంటున్న సమస్యలను సత్వరమే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.