Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

BRS MLC Kalvakuntla Kavitha: చర్చకు ఏ సెంటర్ కైనా, ఏ గల్లీకైనా వస్తా

–బీసీలంటే కాంగ్రెస్, బీజేపీలకు చులకనభావం
–పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమా ర్ గౌడ్ సవాలును స్వీకరిస్తున్నాను
–బీఆర్ఎస్ పార్టీ హ యాంలోని అభివృద్ధిపై చర్చకు సిద్ధం
–42 శాతం రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి
— కామారెడ్డి డిక్లరేషన్ ను యధాత థంగా అమలు చేయాలి
— జనగణనలో కేంద్ర ప్రభుత్వం కుల గణన చేపట్టాలి
–బీసీ మహాసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

BRS MLC Kalvakuntla Kavitha: ప్రజా దీవెన,హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీల హక్కులను కాలరాస్తున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండి పడ్డారు. బీసీలంటే రెండు జాతీయ పార్టీలకు ఎందుకు చులకన అని నిలదీశారు. స్వతంత్రం వచ్చిన ప్పటి నుంచీ బీసీలకు తీరని అన్యా యం చేస్తున్న ఆ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడ మే కాకుండా కామారెడ్డి డిక్లరేషన్ ను యధాతథంగా అమలు చేయా లని రేవంత్ రెడ్డి సర్కారును డి మాండ్ చేశారు.

బీఆర్ఎస్ హ యాంలో బీసీల అభివృద్ధి, ఏడాది కాంగ్రెస్ పాలనలో చేసిన అభివృద్ధి పై చర్చించడానికి సిద్ధమా అని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విసిరిన సవాలును ఎమ్మెల్సీ కవిత స్వీకరించారు. “ఎక్కడైనా ఎప్పుడైనా ఏ గల్లీలోనైనా ఏ సెంట ర్లో నైనా చర్చకు నేను సిద్ధం. తెలం గాణ వచ్చిన తర్వాత కేసీఆర్ నా యకత్వంలో మొదటి 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ఏంది, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసింది ఏమిటి అన్న దానిపై చర్చించడానికి ఎక్క డికైనా వస్తానని ప్రకటించారు.

శుక్రవారం ఇందిరా పార్కు వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరిగిన “బీసీ మహాసభ”లో ము ఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కవిత పాల్గొ న్నారు. వేలాది మంది ప్రజలు హాజ రైన ఈ సభలో దాదాపు 70కిపైగా కుల సంఘాల ప్రతినిధులు ప్రసం గించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లను అమలు చేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహిం చాలని, కామారెడ్డి డిక్లరేషన్ ను యధాతథంగా అమలు చేయాల ని, జనగణనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కులగణన చేపట్టాలని, అసెంబ్లీ ప్రాంగణంలో మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాన్న నాలుగు తీర్మానాలను బీసీ మహాసభ ఆమోదించింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ప్రసంగిస్తూ ఈ బీసీ మహాసభ తో చరిత్రలో ఒక మైలురాయిని వేశామని అన్నారు. బీసీలకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విస్మరించారని విస్మరించారు. కనీస మానవత్వం లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. బీసీ వర్గాల్లో ఉన్న 130 కులాలకు ఒక్కో కులానికి ఒక్కో సమస్య ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ వాటిని పరిష్కారం చేయడానికి మాత్రం ముఖ్యమంత్రికి మనసొప్పడం లేదని విమర్శించారు.

కుల వృత్తుల వారికి కేసీఆర్ అమలు చేసిన పథకాలను నిలిపివేయడం దారుణనిని, కొత్త పథకాలను అమలు చేయకున్నా కనీసం పాత పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే, కర్నాటక, బిహార్ వంటి విఫలైన అనుభవాలు ఉన్నా కూడా తొలుత డేడికేటెడ్ కమిషన్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించలేదని, తెలంగాణ జాగృతి ఉద్యమం చేయడం, హైకోర్టు మొట్టికాయలు వేసేంత వరకు రేవంత్ ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ వేయలేదని తెలిపారు. బీసీల లెక్కలు ఒక కమిషన్ తీస్తుంటే… మరో కమిషన్ నివేదిక ఇస్తుందని, ఇలా చేస్తే కోర్టుల్లో నిలబడుతుందా అని అడిగారు.

ఎటువంటి లోటుపాట్లు లేకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించా ల్సిందనని స్పష్టం చేశారు. లేదంటే బీసీల జనాభా ఎంత ఉంటే అంత వాటా ఇచ్చి ఎన్నికల్లోకి వెళ్లాలని సూచించారు. దొంగ లెక్కలు, కాకిలెక్కలు కాకుండా వాస్తవ లెక్కలు తీయాలని డిమాండ్ చేశారు. మాయదారి మాటలతో, మోసపూరిత పనులతో ప్రజలను మభ్య పెట్టవద్దని సూచించారు. బీసీల గురించి ఎందుకు మాట్లాడుతున్నావంటూ కాంగ్రెస్ నాయకులు నన్ను ప్రశ్నిస్తున్నారని, సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నానని, ఎన్నికలు పూర్తయ్యాక ఎందుకు మాట్లాడలేదని మళ్లీ కాంగ్రెస్ నాయకులే అంటారని చెప్పారు.

రాజ్యాంగం రచించినప్పుడే బీసీలకు రాజ్యంగపరమైన రక్షణ కల్పించి ఉంటే అభివృద్ధిలో భారతదేశం అమెరికాను దాటేసేదని ఎమ్మెల్సీ కవిత అభిప్రాయపడ్డారు. బీసీలకు రాజ్యంగ రక్షణను సాధించడమే అంతిమ లక్ష్యమని, అందు కోసం రాజ్యంగ సవరణ జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. అయితే, దాన్ని దీర్ఘకాలిక లక్యంగా పెట్టుకొని పోరాటం చేద్దామన్నారు.

మొదటి ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ కాకా కాలేల్కర్ కమిషన్ నివేదికను తిరస్కరించారని, ఇది బీసీలకు కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహం కాదా అని ప్రశ్నించారు. మండల్ కమిషన్ ను మొరార్జీ దేశాయ్ నియమించారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు కాదని చెప్పారు. మండల్ కమిషన్ నివేదికను కాంగ్రెస్ పార్టీ తొక్కిపెట్టింది కానీ అమలు చేయలేదని, 1980లో మండల్ కమిషన్ నివేదిక ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేదని అడిగారు. మళ్లీ కాంగ్రెసేతర ప్రధాని వీపీ సింగ్ వచ్చినప్పుడే కమిషన్ నివేదికను అమలు చేసిందని, దాంతో బీసీల కోసం పని చేస్తున్న వీపీ సింగ్ ప్రభుత్వాన్ని బీజేపీ పార్టీ కూలగొట్టిందని మండిపడ్డారు.

నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ హయాంలో బీసీలకు అన్యాయం జరిగిందని, బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే దేశం విచ్ఛిన్నం అవుతుందని రాజీవ్ గాంధీ అన్నారని ప్రస్తావించారు. 2011 కులగణన చేసిన నివేదికను అప్పటి యూపీఏ ప్రభుత్వం బహీర్గతం చేయలేదని, ఆ తర్వాత వచ్చిన బీజేపీ ప్రభుత్వం కూడా నివేదిక బయటపెట్టలేదని ఎత్తిచూపారు. కులగణన చేయబోమని బీజేపీ స్పష్టం చేసిందని గుర్తు చేశారు. తాను చెప్పిన ఈ విషయాలు తప్పయితే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాలు చేశారు.

కేవలం ప్రాంతీయ పార్టీలు మాత్రమే బీసీలకు న్యాయం చేశాయని అన్నారు. ముఖ్యంగా కేసీఆర్, ఎన్టీఆర్ వంటి ప్రాంతీయ పార్టీల నాయకులు మాత్రమే బీసీలకు న్యాయం చేశారని తెలిపారు. దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా బీసీలకు జరిగిన లాభం ఏమిటో ఆలోచించాలని అన్నారు.

జంగుపట్టిన ప్రభుత్వ రథచక్రాలు కదులుతున్నాయి
బీసీ సంఘాలతో కలిసి తాము చేసిన ఉద్యమాల వల్లే సావిత్రీబాయి పూలే జయంతిని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. తమ ఉద్యమాలతో జంగుపట్టిన ప్రభుత్వ రథచక్రాలు కదులుతున్నాయని అన్నారు.

సావిత్రీబాయి పూలే ఆడబిడ్డ కాదు… పులిబిడ్డ అని కొనియాడారు. మహిళా విద్యాకు ఎంతగానో కృషి చేశారని, ఎంతో మంది మహిళలకు చదువును నేర్పించిన వ్యక్తి సావిత్రీబాయి అని కీర్తించారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా సమాజ వికాసం కోసం పని చేశారని చెప్పారు.

ఈ మహాసభలో శాసన మండలి మాజీ చైర్మన్ స్వామీ గౌడ్, కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ తుల ఉమా, కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీంద్ర సింగ్, సుమిత్రా తానోబా, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రూప్ సింగ్, ముఠా జైసింహా, గట్టు రామచందర్ రావు, క్యామ మల్లేశం, పల్లె రవి కుమార్ గౌడ్, గడ్డం శ్రీనివాస్ యాదవ్, మఠం భిక్షపతి, కిశోర్ గౌడ్, ఉపేందర్, తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులు నవీన్ ఆచారి, వరలక్ష్మీ మంచాల, అనంతుల ప్రశాంత్, పెంట రాజేశ్, అప్పాల నరేందర్ యాదవ్, పరకాల మనోజ్ గౌడ్, కిశోర్ యాదవ్, బీసీ సంఘాల నేతలు బొల్ల శివశంకర్, ఆలకుంట హరి, ఆర్వి మహేందర్, గోవర్ధన్ యాదవ్, గొరిగే నరసింహ, గోప సదనందు, కోట్ల యాదగిరి, ఎం నరహరి, దుగట్ల నరేష్, ఇతరి మారయ్య, కుమార స్వామి, గంధాల శ్రీనివాస్ చారి, రమేష్ బాబు, జి హరిప్రసాద్, సురేందర్, విజేందర్ సాగర్, శ్రీధర్ చారి, రవీంద్రనాథ్, కే శ్రీనివాస్, ప్రవీణ్, భారత అఖిల్, హరి దేవ్ సింగ్, సురేష్, మురళీకృష్ణ, నిమ్మల వీరన్న, మందుల శ్రీనివాస్, కే నరసింహ రాజు, ప్రవీణ్, పార్వతయ్య, నరసింహ, కడెకేకర్ రాకేష్, ఆవుల మహేష్, ఎంగులూరి శ్రీను, హుస్సేన్, రామచందర్, వాడేపల్లి మాధవ్, శ్యాంసింగ్ లోదే, దామ శివ కుమార్, వేణుమాధవ్, ఎండి నవీద్, వరలక్ష్మి, స్వప్న, లావణ్య యాదవ్ పద్మా గౌడ్ సూర్య పల్లి పరశురాం, ఏ చాలా దత్తాత్రేయ, జిల్లా నరేందర్, డాక్టర్ కీర్తి లతా గౌడ్, వింజమూరి రాఘవాచారి, సాల్వా చారి, రూపా దేవి, అప్ప సతీష్ తదితరులు పాల్గొన్నారు.