Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Air India:ఎయిరిండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు కారణం ఇదే

Air India:ప్రజా దీవెన, హైదరాబాద్: దుబాయ్ నుంచి వస్తున్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. భద్రతా కారణాల దృష్ట్యా కేరళలోని మలప్పురం జిల్లాలోని కరిపూర్ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. విమానంలోని హైడ్రాలిక్ సిస్టమ్‌లో కొంత లోపం ఉందని పైలట్ తెలిపారు. ఆ తర్వాత ల్యాండ్‌ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

ఎయిర్ ఇండియా విమానం ఐఎక్స్ 344 ఉదయం 8:30 గంటలకు కరిపూర్‌లో ల్యాండ్ అయింది. అంతకుముందు అక్కడి విమానాశ్రయం మొత్తంలో ఎమర్జెన్సీని ప్రకటించారు.