Girls Missing: ప్రజా దీవెన, నిజామాబాద్: తెలంగాణలో సంచలనం రేకెత్తిం చిన పాఠశాల విద్యార్థి నీల అదృ శ్యం కేసు మిస్టరీ వీడింది. విద్యార్థి నీలే స్వీయ నిర్ణయంతో స్కూలు డుమ్మా కొట్టి ఫ్రీ బస్సు ఎక్కి చక్క ర్లు కొడుతున్న సమాచారం వెలు గులోకి వచ్చింది. ఎట్టకేలకు అను మానాలన్నింటిని నివృత్తి చేస్తూ నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం బాలికల ఉన్నత పాఠ శాల నుండి అదృశ్య మైన ముగ్గు రు బాలికల ఆచూకీ లభ్య మైంది.
ఈ ముగ్గురు విద్యార్థినులు ప్రభుత్వం కొనసాగిస్తున్న ఉచిత బస్సు ప్రయాణాన్ని అవకాశంగా తీసుకొని ఆర్టీసీ బస్సులో నిజామా బాద్, కామారెడ్డి, జగిత్యాల, కరీం నగర్ వెళ్లి చక్కర్లు కొడుతూ తిరి గివచ్చారు. ఈ ముగ్గురు విద్యార్థి నుల ఆచూకీ కొరకు తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.సెల్ ఫోన్ ట్రాకింగ్ ద్వారా విద్యార్థి నులను పట్టుకొని బాలికలను తల్లి దండ్రులకు అప్పగించిన పోలీసు లు. ముగ్గురు బాలికల ఆచూకీ లభించడంతో కథ సుఖాంతమైంది.