*బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి
Palamuru Vishnuvardhan Reddy: ప్రజా దీవెన, షాబాద్:షాబాద్ మండలం బిజెపి మండల అధ్యక్షుల ఎన్నిక అభిప్రాయ సేకరణ షాబాద్ మండల కేంద్రంలోని MS గార్డెన్ లో మండల అధ్యక్షులు కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ గా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి గారు హాజరయ్యి బిజెపి నూతన మండల అధ్యక్షుల ఎన్నికకు అభిప్రాయ సేకరణ చేయడం జరిగింది.
విష్ణువర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతా మండల అధ్యక్షులు ఎవ్వరైనా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలిపించవలసిన బాధ్యత నూతన మండల అధ్యక్షులదే అని అన్నారు.ఈ కార్యక్రమంలో షాబాద్ మండల క్రియాశీల సభ్యులు, పోలింగ్ బూత్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు పాల్గొనడం జరిగింది.