MP Chamala Kiran Kumar Reddy: ప్రజా దీవెన, శాలిగౌరారం: దీర్ఘకా లికంగా ఉన్న ఐకేపీ విఓఏ ల సమ స్యలను వెంటనే పరిష్కరించాలని శాలిగౌరారం ఐకేపీ విఓఏ ఉద్యో గుల జాయింట్ కమిటీ ఎమ్మెల్యే మందుల సామేల్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి లకు శనివారం వినతిపత్రం సమర్పించారు.తమకు కనీస వేతనం లేక ఎంతో పని భా రం తో 60 రకాల పనులు చేస్తూ ఇ బ్బందులు పడుతున్నామని ఆవే దన వ్యక్తం చేశారు.ఉద్యోగ భద్రత కలిపించి,కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని,సెర్ప్ ఉద్యోగులు గా గుర్తించి ఐడి కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
గ్రేడింగ్ పద్ధతిని రద్దు చేయాలన్నారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే సామేల్, ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డిలు మాట్లాడుతూ విఓఏ ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమం లో మండల విఓఏ ల అధ్యక్షురాలు కల్లూరి రేణుకా దేవి, కార్యదర్శి కట్టంగూరి పద్మ, కోశాధికారి మర్మోజు పద్మ, ఉపాధ్యక్షురాలు ఆకవరం గీతారాణి, సహాయ కార్యదర్షి గిరిగాని పార్వతమ్మ తదితరులు పాల్గొన్నారు.