Kusukuntla raja reddy: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్ : నల్లగొండ రీజినల్ ట్రాన్స్ ఫోర్ట్ అథారిటీ సభ్యునిగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూసుకుంట్ల రాజి రెడ్డి నియమితులయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతి జిల్లా నుంచి ఒకరిని ఆర్టిఏ సభ్యుడిగా నియమించింది. నల్లగొండ జిల్లా నుంచి రాజిరెడ్డి నియమిస్తూ శని వారం తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశా రు. కనగల్ మండలం చెర్ల గౌరారం గ్రామానికి చెందిన రాజిరెడ్డి గతం లో యువజన కాంగ్రెస్ కనగల్ మం డల అధ్యక్షుడిగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చురుకైన కార్యకర్తగా, నా యకుడిగా పనిచేస్తున్నారు.
రాజిరె డ్డి ఆర్టిఏ సభ్యుడిగా నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశా రు. రీజినల్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ సభ్యుడిగా తన నియామకానికి కృషిచేసిన మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, కనగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం అనుప్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్ కు, పలువు రు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయ కులు, కార్యకర్తలు, శ్రేయోభిలా షులకు ఈ సందర్భంగా కూసు కుంట్ల రాజిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.