–రెడ్ జోన్లో 26 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
–రాష్ట్రవ్యాప్తంగా థర్డ్ పార్టీ సర్వే నిర్వహించిన రేవంత్ రెడ్డి
Revanth Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: కాంగ్రెస్ గెలిచిన 65 అసెంబ్లీ నియో జకవర్గాలతో పాటు, ప్రతిపక్ష బీఆ ర్ఎస్, బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తు న్న ఇతర విభాగాలపై సీఎం రేవంత్ రెడ్డి సర్వే చేయించారు. ఈ సర్వే లో ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ప్రభు త్వం పనితీరు, జిల్లా లేదా స్థానిక స్థాయిలో పరిపాలన మరియు ప్రజల ఆశయాలపై దృష్టిసా రిం చడం ద్వారా నివేదిక రూపొం దించారు. అయితే ఈ సంచలన మైన సర్వే లో 26 మంది ఎమ్మె ల్యేలు రెడ్ జోన్లో, 14 మంది ఆరెంజ్ జోన్లో, మిగతా వారు సేఫ్ జోన్లో ఉన్నారని సర్వే వర్గాలు వెల్ల డించాయి. సర్వే ప్రకారం కొంతమం ది మంత్రులు వారి నియోజక వర్గా ల్లో తీవ్రమైన ఆరోపణలు ఎదు ర్కొంటున్నారు. కొందరు ఎమ్మెల్యే లు తమ నియోజకవర్గాల్లో అభి వృద్ధిని నిర్లక్ష్యం చేసినందుకు విమ ర్శలను ఎదుర్కొంటున్నారు.
రెడ్ జోన్లో ఉన్న ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలను సందర్శించ కుండా, హైదరాబాదులో ఎక్కువ సమయం గడుపుతూ వారు వారి వ్యాపార ప్రయోజనాలకు ప్రాధా న్యత ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మరి కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అక్రమ కార్యకలా పాల ను ప్రోత్సహిస్తున్నారని ఆరోపణ లు వినిపించాయి.వీరిలో 8 నుంచి 10 మంది ఇసుక అక్రమ రవాణా, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పంక్తు లు కలిగించే కార్యకలాపాలను ప్రో త్సహిస్తున్నారని సర్వేలో వెల్లడి అయింది. ఇక ఆరెంజ్ జోన్లోని ఎమ్మెల్యేలు ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలమై, పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకులతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు సర్వే వెల్లడించింది. దావోస్ పర్యటన నుండి తిరిగి వచ్చిన తర్వాత రెడ్ జోన్, ఆరెంజ్ జోన్ ఎమ్మెల్యేలతో సమావేశాలను ఏర్పాటు చేయా లనే యోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లు సమాచారం.