Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

T Chiranjeevilu: పంచాయతీ ఎన్నికల్లో బీసీ జెండా ఎగరాలి

–బిసి ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ టి చిరంజీవులు

T Chiranjeevilu: ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్రంలో త్వరలో జరుగు పంచాయతీ ఎన్నికల్లో జనరల్ సీట్లలో బీసీలు అభ్యర్థులుగా నిలబడి గెలవాలని ఇంటలెక్చువల్ ఫోరమ్ చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టీ.చిరంజీవులు పిలుపు నిచ్చారు. ఆదివారం హైదరాబాద్ ఘట్కేసర్ లోని జెకె కన్వెన్షన్ హాల్లో పంచాయతీ ఎన్నికలు బీసీల పాత్ర అంశంపై బిసి ఇంటలెక్చువల్స్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలతో కలిసి పనిచేసి ప్రజల విశ్వాసం చూరగొని సర్పంచ్, వార్డ్ మెంబర్లుగా, ఎంపీటీసీ, జడ్పిటిసిలు, ఎమ్మెల్సీ స్థానాల్లో బీసీ నేతలకు గెలవాలని ఆయన కోరారు. రాష్ట్రంలో పంచాయతీరాజ్ సంస్థల పరిణామ క్రమం ఆయన ఈ సందర్భంగా వివరించారు.

ఈ కార్యక్రమంలో శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మాట్లాడుతూ బీసీలు ఏకమై బిసి అభ్యర్థులు గెలిచేందుకు బిసి కులాల ఐక్యం కావాలని ఆయన కోరారు. గతంలో పల్లెల్లో పట్టణాల్లో బిసిలకు చైతన్యం లేకపోయదని ఇప్పుడు రాజ్యాధికార చైతన్యం వచ్చిందని ఈ నేపథ్యంలో పల్లెలో బిసి చైతన్యము వెల్లువిరిసేందుకు కృషిచేసి బీసీ అభ్యర్థులు గెలవాలని ఆయన అన్నారు. బీసీ నేతలను ఐక్యత చేసేందుకు కుల సంఘాల నేతలు కూడా కృషి చేయాలని ఆయన సూచించారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ బీసీలు పార్టీల వారీగా విడిపోకూడదని కచ్చితంగా గెలిచే విధంగా వ్యూహాత్మక ఎత్తుగడలు అవలంబించాలని వివరించారు.

మాజీ ఐఏఎస్ అధికారి సొల్లేటి ప్రభాకర్, బీసీ నేత చెరుకు సుధాకర్, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, కరీంనగర్ మాజీ జెడ్పీ చైర్ పర్సన్ తుల ఉమా మాట్లాడుతూ ప్రజల సమస్యల పట్ల స్పందించి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తే ప్రజలు గెలిపిస్తారని, ప్రజల కోసం పోరాటాలు చేయాలని ఆమె పిలుపునిచ్చారు. మాజీ ఐఏఎస్ అధికారి సొల్లేటి ప్రభాకర్ లతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి బీసీ సంఘాల నాయకులు కుల సంఘాల నాయకులు, మేధావులు కార్యక్రమంలో పాల్గొన్నారు.