Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Pensioners… don’t worry: పింఛనుదారులూ… ఫికర్ పడకండి

-- ఇకపై సూపర్ సీనియర్ పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ --ఇంటి నుండే స్మార్ట్‌ఫోన్ ద్వారా బ్యాంక్ బ్రాంచ్‌లో అప్పగించొచ్చు --సహాయపడటానికి బ్యాంక్ లలో డోర్‌స్టెప్ ఎగ్జిక్యూటివ్‌ల సౌకర్యం

పింఛనుదారులూ… ఫికర్ పడకండి

— ఇకపై సూపర్ సీనియర్ పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌
–ఇంటి నుండే స్మార్ట్‌ఫోన్ ద్వారా బ్యాంక్ బ్రాంచ్‌లో అప్పగించొచ్చు
–సహాయపడటానికి బ్యాంక్ లలో డోర్‌స్టెప్ ఎగ్జిక్యూటివ్‌ల సౌకర్యం

ప్రజా దీవెన/న్యూఢిల్లీ: పింఛనుదారులూ…ఇక ఫికర్ పడకండి. ఎందుకు అనుకుంటున్నారా అదేనండి మీకు అప్పుడప్పుడు ఇబ్బంది కలిగించే లైఫ్ సర్టిఫికెట్ విషయంలో అని చెప్పక తప్పదు. జబ్బుపడిన, ఆసుపత్రిలో చేరిన పింఛనుదారులకు లైఫ్ సర్టిఫికేట్‌లను సమర్పించడంలో సహాయపడటానికి ‘డోర్‌స్టెప్ ఎగ్జిక్యూటివ్‌లను’ (Doorstep Executives to help submit Life Certificates) పంపడానికి ఏర్పాట్లు చేయాలని పెన్షన్ పంపిణీ చేసే అన్ని బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. 80 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సూపర్ సీనియర్ పెన్షనర్లకు డిజిటల్ మాధ్యమం ద్వారా లైఫ్ సర్టిఫికేట్‌లను (Life certificates through digital medium to super senior pensioners) పొందడంపై అవగాహన కల్పించడానికి అన్ని బ్యాంకులు కృషి చేయాలని పెన్షనర్ల సంక్షేమ శాఖ తన ఆర్డర్‌లో పేర్కొంది. ఫేషియల్ వెరిఫికేషన్ టెక్నాలజీని ఉపయోగించి పెన్షనర్ల డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ను రూపొందించవచ్చు. పెన్షన్ పొందడానికి పింఛనుదారులందరూ ప్రతి సంవత్సరం తాము బతికే ఉన్నట్లు సంబంధించిన రుజువును ఇవ్వాల్సిన దానినే లైఫ్ సర్టిఫికేట్ అని పేర్కొంటారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు 69.76 లక్షల మంది ఉండగా 2019లో సూపర్-సీనియర్ పెన్షనర్లు తమ జీవిత ధృవీకరణ పత్రాలను నవంబర్‌లో కాకుండా అక్టోబర్ 1 నుండి సమర్పించడానికి అనుమతించాలని కేంద్ర ప్రభుత్వం బ్యాంకులను కోరింది. అయితే 80 ఏళ్లలోపు పింఛనుదారులు తమ జీవిత ధృవీకరణ పత్రాన్ని నవంబర్‌లో సమర్పించాల్సి ఉంటుంది. ఇంట్లో కూర్చొనే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ (Digital Life Certificate sitting at home) ఈనెల 25వ తేదీన DOPPW జారీ చేసిన ఉత్తర్వులో ఇప్పుడు ప్రతి పెన్షనర్ ఫేషియల్ వెరిఫికేషన్ టెక్నాలజీ ద్వారా తయారు చేయబడిన డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ (DLC) ను తన ఇంటి నుండి తన స్మార్ట్‌ఫోన్ ద్వారా లేదా బ్యాంక్ బ్రాంచ్‌లో సమర్పించవచ్చని చెబుతోంది. తాజాగా జారీ అయిన ఉత్తర్వుల మేరకు బ్యాంకులు డోర్‌స్టెప్ బ్యాంకింగ్ ఎగ్జిక్యూటివ్‌లను నియమించడం (Banks hiring doorstep banking executives) ద్వారా లైఫ్ సర్టిఫికేట్‌లను సమర్పించే సౌకర్యాన్ని అందించవచ్చు. అక్టోబర్ 1 నుంచి 80 ఏళ్లు పైబడిన పింఛనుదారులకు ఈ సదుపాయం కల్పించాలని బ్యాంకులు తమ శాఖలకు సూచించవచ్చు. ఈ క్రమంలో డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ తయారు చేసే సదుపాయంపై అవగాహన కల్పించేందుకు వివిధ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించుకోవాలని బ్యాంకులకు సూచించారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని బ్యాంకు శాఖలు, ఏటీఎంలలో పోస్టర్ల ద్వారా తెలియజేయవచ్చు.