Father of Green Revolution MS Swaminathan passed away: హరిత విప్లవ పితామహుడు ఎమ్ఎస్ స్వామినాథన్ మృతి
హరిత విప్లవ పితామహుడు ఎమ్ఎస్ స్వామినాథన్ మృతి
ప్రజా దీవెన/ చెన్నై: అఖిల భారత ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, జన్యుశాస్త్ర నిపుణుడు, హరిత విప్లవ పితామహుడు ఎమ్ఎస్ స్వామినాథన్(98) కన్నుమూశారు ( Father of Green Revolution MS Swaminathan (98) passed away). గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు.
ఆహార వృద్ధిలో భారత్ స్వయం సమృద్ధి సాధించేందుకు స్వామినాథన్ ( Swaminathan to make India self-sufficient in food growth) ఎంతో కృషి చేశారు. 1925 ఆగష్టు 7వ తేదీన జన్మించిన ఆయన పద్మశ్రీ, పద్మ విభూషణ్, రామన్ మెగసెసె వంటి ఎన్నో పురస్కారాలు అందుకున్న విషయం విదితమే.
ఆయన మృతిపట్ల దేశంలోని ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.