Umamaheshwar Rao: ప్రజాదీవెన, నల్గొండ : మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ , జాతీయ పరీక్ష కేంద్రం, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్ మైసూరు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన “తెలుగులో పరీక్ష , మూల్యాంకనం మరియు ప్రశ్నాంశ రచన పద్ధతి ” అంశంపై ఉమ్మడి జిల్లా కళాశాల మరియు ఉన్నత పాఠశాలల తెలుగు అధ్యాపకులకు ఆరు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఉపకులపతి ఆచార్య అల్తాఫ్ హుస్సేన్ ప్రారంభించారు.
జాతీయ స్థాయి కార్యక్రమాల నిర్వహణ పరంపరతో ఎం జీ యు లాంటి విశ్వవిద్యాలయ స్థాపన సదుద్దేశం నెరవేరే దిశలో సాగడం శుభ పరిణామం అన్నారు. బోధన ప్రశ్నావళి రూపకల్పన మరియు మూల్యాంకనం ఉన్నత విద్యలో అత్యంత కీలకమన్నారు. అనునిత్యం విద్యార్థుల అభ్యసన సరళిని అధ్యాపకులు పరిశీలించాల్సి…