Paladugu Nagarjuna: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నిరుపేదలకు నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సబ్సిడీ ద్వారా వాహనాలు, పరిశ్రమలు, స్వయం ఉపాధి పథకాలకు ఇచ్చే సబ్సిడీ యధావిధిగా అమలు చేయాలనీ కులావివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ఉపాధ్య క్షులు పాలడుగు నాగార్జున డిమాం డ్ చేశారు. మంగళవారం నల్గొండ కెవిపిఎస్ కార్యాలయం పత్రిక విలేకరుల సమావేశంలో మాట్లా డారు. పాలడుగు నాగార్జున రాష్ట్ర ఉపాధ్యక్షులు జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీను, రాష్ట్ర కమిటీ సభ్యులు రేమిడాలా పరుశరాములు కలిసి మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తేదీ డిసెంబరు 2024 నుండి టాక్సీ మరియు మోటారు క్యాబ్ సబ్సిడీలు Sc,ST, PHC లబ్దిదారులకు నిలిపి వేస్తున్నట్లు ప్రకటించడం అన్యాయ మన్నారు.ఇప్పటికే గత మూడు సంవత్సరాలుగా సబ్సిడీలు రావడం లేదని తెలిపారు.
బ్యాంకు లకు రుణాలు కట్టలేకపోవడం వలన జప్తు చేస్తున్న ఘటనలు జరిగాయాన్ని తెలిపారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వలన పేద కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉండన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఇందిరమ్మ రాజ్యం తెస్తున్నామని పేదరికం లేకుండా చేస్తామని వాగ్దానం చేసి నేడు పేదల పొట్టలు కొడుతున్నారని, నిరుద్యోగుల పాలిట శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. దళిత, గిరిజన, వికలాంగులతో కలిపి జిల్లా పరిశ్రమల ఆఫీస్ ముందు నిరసన దిక్షలు చేయమున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలను సమీకరించి ధర్నాలు, రాస్తా రోకోలు ఉద్యమాలు నిర్వహిస్తామని తెలిపారు.