Kishan Reddy : తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ గుండాల దాడిని ఖండించిన :కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Kishan Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ గుండాలు పోలీసులను వెంటబెట్టుకుని వచ్చి బిజెపి పార్టీ కార్యాలయంపై రాళ్లు విసురుతూ కార్యకర్తలపై కర్రలతో, రాళ్లతో దాడులు చేస్తుంటే పక్కనే ఉన్న పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం సమంజసం కాదని కేంద్ర మంత్రి,బిజెపి రాష్ట్ర అధ్యక్షులు G. కిషన్ రెడ్డి అన్నారు..
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ బిజెపి కార్యాలయం పై కాంగ్రెస్కు దాడి చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం ఎంతవరకు సమంజసం అని మీడియా ద్వారా పోలీస్ కమిషనర్ ప్రశ్నిస్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు.దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతున్న, ఆ పార్టీ కార్యకర్తలకు బుద్ధి రావట్లేదని కిషన్ రెడ్డి విమర్శించారు..
దేశవ్యాప్తంగా కేవలం మూడు రాష్ట్రాల్లోనే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రానున్న ఎన్నికల్లో పూర్తిగా కనుమరుగవుతున్న కారణంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరాశ నిస్పృహతో ఈ రకంగా దాడులకు పాల్పడితే ప్రజలు క్షమించరని కిషన్ రెడ్డి తెలియజేశారు..
మీరు బిజెపి పార్టీ కార్యాలయాల పైన ,కార్యకర్తల పైన ఎన్ని దాడులకు పాల్పడిన మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై పోరాడుతామని మీయొక్క వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువస్తామని రాబోయే ఎన్నికల్లో ప్రజలే మీకు సరైన రీతిలో బుద్ధి చెప్తారని కిషన్ రెడ్డి తెలిపారు