Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Gutta Amit Reddy: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధాధపుగా 63000 కొట్లు రైతుల కొరకు ఖర్చు

Gutta Amit Reddy: ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : నల్గొండ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రామివృద్ది సంస్థ సహకార సమాఖ్య లిమిటెడ్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి మాట్లాడుతూ మీడియా మిత్రులకు, తెలంగాణ రాష్ట్ర మరియు నల్గొండ జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. రైతు బరోసా పథకం క్రింద రైతులకు అందించే పెట్టుబడి సహాయాన్ని ఏడాదికి 10,000/-నుండి 12,000/- పెంచినందుకు గాను అలాగే భూమి లేని కౌలు రైతులకు కూడా ఏడాదికి 12,000/- ఇస్తున్నందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ధన్యవాదములు.డిండి ప్రాజెక్టు కొరకు 1800 కోట్ల రూపాయలు నిధులు క్యాబినేట్ మీటింగ్ లో విడుదల చేసిన ముఖ్యమంత్రి కి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి, ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి ధన్యవాదములు.

త్రిబుల్ ఆర్ కొరకు విశేషంగా కృషి చేసి టెండర్ దశకు తెచ్చిన ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి ధన్యవాదములు.బి ఆర్ యస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే‌టి‌ఆర్ కి ఈ రేసింగ్ ముఖ్యం ,కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కు రైతన్నలను ఆదుకోవడం ముఖ్యం , తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత బడ్జెట్ లో 30% అనగా ధాధపుగా 63000 కొట్లు రైతుల కొరకు ఖర్చు చేయడం జరిగింది.బి ఆర్ యస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తప్పుచేయాకపోతే కేసులకు ఎందుకు భయపడుతున్నారని , ఆయనకి నిద్రలో కూడా ఫార్ములా ఈ రేస్ కేసునే కలపడుతున్నట్లు ఉంది. చట్టం దృష్టిలో అందరూ సమానమే , అందుకే కేటీఆర్ పైన విచారణ జరుగుతుంది.

ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితగాని స్వామి గౌడ్ నాగులవంచ వెంకటేశ్వర్ రావ్,దుబ్బ అశోక్ సుందర్, మునాసు వెంకన్న,మందడి మధుసూదన్ రెడ్డి, కంచరకుంట్ల గోపాల్ రెడ్డి, శ్రీరామ దాసు హరి కృష్ణ, చిలకరాజు శ్రీనివాస్, వలిశెట్టి మల్లయ్య, రెగట్టే సైదులు తదితరులు పాల్గొనడం జరిగింది.