సంక్రాంతి సందడి, రేపటినుంచి స్కూళ్లు, కాలేజీలకు సెలవులు
Sankranthiholidays: ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్రం లోని ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ కాలేజీలకు శనివారం నుంచి సంక్రాంతి పండుగ సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. శనివారం నుంచి 17 వరకు ఏడురోజు లపాటు పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది.
శనివారం నుంచి 16 వరకు ఆరురోజులపాటు జూనియర్ కాలేజీ లకు సంక్రాంతి సెలవులుంటాయి. ఈనెల 18న పాఠశాలలు, 17న జూనియర్ కాలేజీల్లో తిరిగి తరగతులు ప్రారంభమవుతాయి.