బిగ్ బ్రేకింగ్, రెండు బైక్ లు డీకొని ముగ్గురి మృతి
severe roadaccident : ప్రజా దీవెన, జగిత్యాల: జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జగిత్యాల ధర్మపురి ప్రధాన రహదా రిపై తక్కలపల్లి అనంతరం మధ్య జరిగిన ఈ దుర్ఘటనలో రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొని ముగ్గురు మృతి చెందారు.
ఈ ప్రమాదంలో జగిత్యాల రూరల్ మండలం జాబితా పూర్ కు చెందిన అరవింద్, బత్తుల సాయి అక్కడి కక్కడే మృతి చెందగా మరో యువ కుడు వంశీని చికిత్స నిమిత్తం జగి త్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలి స్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.
వారం రోజుల క్రితం వంశీ గల్ఫ్ నుండి వచ్చి తిరుపతి వెళ్లి వచ్చాడు. తిరుపతి ప్రసాదం ఇచ్చి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బైకులు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెంద గా వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.