Prabhavati :ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నాయని పెరిగిన ధరలతో సామాన్య ప్రజలు కొనలేని తినలేని స్థితిలోకి నెట్టబ డుతున్నారని పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రజా పంపిణీ ద్వా రా 14 రకాల నిత్యావసర వస్తు వులు సరఫరా చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సం ఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాల డుగు ప్రభావతి ప్రభుత్వానికి డిమాండ్ చేశారు ఈరోజు మ ల్లేపల్లి మండల కేంద్రంలో సంత కాల సేకరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభావతి మా ట్లాడుతూ పెట్టుబడుదారులకు అనుకూలమైన విధానాలు తీసు కురావడం వలన.
ఈరోజు పేదలపై అధిక భారాలు మోపుతున్నారని అన్నారు ధరలను నియంత్రించ డంలో ఘోరంగా విఫలం చెందారని తెలియజేశారు దేశంలో సంపన్నుల సంఖ్య పెరిగిపోతుందని పేదరికంలోకి నెట్టబడుతున్న పేదల సంఖ్య మరింత పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం బడ్జెట్లో పేదల సంక్షేమం గురించి కేటాయింపులు చేయడం లేదని ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేసి పెట్టుబడిదారులకు దోపిడీదారులకు బార్ల తలుపులు తెరిచిందని అన్నారు పెరుగుతున్న ధరలను నియంత్రించి ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాలని జిల్లా వ్యాప్తంగా సంతకాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక పంపనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఐద్వ జిల్లా రాష్ట్ర కమిటీ సభ్యురాలు పద్మ మనీషా మంజుల ఏకలవ్య ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.