*పండగలను శాంతియుతంగా జరుపుకోవాలని : రామారావు
Vangaviti Rama Rao :ప్రజా దీవెన,కోదాడ: క్రీడలు మానసిక ఉల్లాసానికి మంచి ఆరోగ్యానికి దోహదపడతాయని జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు అన్నారుసంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని కోదాడ పట్టణ పరిధిలోని కొమరబండలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో గ్రామస్థాయి వాలీబాల్ మరియు ముగ్గుల పోటీ లను ఆదివారం నిర్వహించారు, ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా సూర్యాపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు పాల్గొని క్రీడలను ప్రారంభించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ యువత క్రీడలలో రాణించి గ్రామ పేరును జిల్లా ,రాష్ట్ర స్థాయిలలో నిలిపి పుట్టిన ఊరికి ఖ్యాతిని తేవాలని, క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని ఆయన అన్నారు, ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు మామిడి రామారావు,తమలపాకుల లక్ష్మీనారాయణ, కొమరబండ మత్స్యశాఖ డైరెక్టర్లు బత్తుల కిట్టు యాదవ్, వేముల వీరబాబు, కొర్ర పిడతల వీరబాబు, చట్టం మురళి,
కర్లపూడి బాలకృష్ణ, మంద నాగేంద్రబాబు, సంపేట నరేష్ గౌడ్, షేక్ నస్రత్, దేవపంగు ధన మూర్తి, ఫ్రెండ్స్ యూత్ ఆర్గనైజర్స్ చట్టు భాను, నెమ్మాది సిద్దు, గోపి చారి, దాసరి అఖిల్, పలువురు యువకులు పాల్గొన్నారు