Hopes are gone: ఆశలు ఆవిరైనట్లేనా
-- సమయం పూర్తయిన వారిద్దరూ ఇంకా నిద్ర లేవలే -- సన్నగిల్లిన 14 రోజుల తర్వాత నిద్రలేవాలన్నా ఆశ --తిరిగి సూర్యోదయమై వేడి వాతావరణం నెలకొన్నా మేల్కొంటాయా అన్న అనుమానం
ఆశలు ఆవిరైనట్లేనా
— సమయం పూర్తయిన వారిద్దరూ ఇంకా నిద్ర లేవలే
— సన్నగిల్లిన 14 రోజుల తర్వాత నిద్రలేవాలన్నా ఆశ
–తిరిగి సూర్యోదయమై వేడి వాతావరణం నెలకొన్నా మేల్కొంటాయా అన్న అనుమానం
ప్రజా దీవెన /ఇస్రో: ప్రపంచంలోనే ఎవరూ అడుగుపెట్టని చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరిన ఒకే ఒక్కటి భారత విక్రమ్ ల్యాండర్ అనేది చరిత్ర. భారతదేశమే కాక ప్రపంచం మొత్తం మన దేశ శాస్త్ర సాంకేతికతపై మనసు పారేసుకున్న సమయంలో కొంత అసంతృప్తి ( There was some dissatisfaction at the time when the mind was drawn to the technique of national science) కూడా చవిచూసే అవకాశాలు లేకపోలేదని నిపుణులు పేర్కొంటున్నారు.
చంద్రునిపై చక్కర్లు కొట్టిన ప్రజ్ఞాన్ రోవర్లు చంద్రుడిపైనే 14 రోజుల రాత్రి తర్వాత మళ్లీ నిద్రలేవాలని (The Pragyan rovers are supposed to wake up again after 14 days of night on the moon itself) యావత్ ప్రపంచం కోరుకుంటున్నా చoదమామపై చిమ్మచీకట్లను చీల్చుకుంటూ తెల్లవారినా కానీ విక్రముడు మాత్రం లేవలేదనే సరికి అందరికి ఒక్కసారిగా ఉసూరు మన్నారు. అలవాటు లేని చలిలో గడ్డకట్టుకుపోయాడా అంటే అవునేమో అనిపిస్తుంది.
ఆయితే సెప్టెంబరు 22వ తేదీన అక్కడ తెల్లవారింది కానీ ఆ వ్యోమనౌకల నుంచీ ఇప్పటికీ స్పందన రాకపోవడమే అసలు సమస్య. దీంతో అవి మేల్కొని, మళ్లీ పరిశోధనలు చేస్తాయన్న ఆశలు మెల్ల మెల్లగా సన్నగిల్లుతున్నాయని చెప్పకనే చెప్పవచ్చు ( It goes without saying that hopes are slowly fading). నాడు వెళ్లేటప్పుడు వెంట కొలిమిలాంటి ఓ సాధనాన్ని తీసుకెళ్లుంటే విక్రమ్ ఇప్పటికల్లా మళ్లీ క్రియాశీలమై ఉండేదనేది నిపుణుల భావన.
విక్రమ్, ప్రజ్ఞాన్లకు సౌరశక్తే ఆధారమైనందున అవి చంద్రుడి ఉపరితలంపై 14 రోజుల పగటి సమయంలోనే పనిచేయగలవు. ఆ తర్వాత వచ్చిన 14 రోజుల రాత్రి వేళలో మైనస్ 200 డిగ్రీల సెల్సియస్ వరకూ ఉష్ణోగ్రతలు పడిపోతుంటాయి. అంత శీతల వాతావరణంలో రెండు వారాలు కొనసాగడం ( Lasting two weeks in such cold weather) వల్ల వ్యోమనౌకల్లోని కొన్ని లోహభాగాలు పెళుసుబారుతాయి.
మొత్తానికి అవి శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అక్కడ తిరిగి సూర్యోదయమై, వేడి వాతావరణం నెలకొన్నా అవి పనిచేయలేని పరిస్థితి నెలకొంటుందనే అభిప్రాయం ( It is believed that even if the sun rises again and the weather becomes hot, they will not be able to work) అంతటా విస్తరించి ఉంది. వ్యోమనౌకల్లో పరమాణు జనరేటర్లను ఏర్పాటు చేస్తే శీతల వాతావరణంలోనూ పరికరాలను వెచ్చగా ఉంచొచ్చు. వీటిని రేడియోఐసోటోపిక్ హీటర్ యూనిట్ (ఆర్హెచ్యూ)గా పేర్కొంటారు.
ఇందులో ఎక్కువగా ప్లుటోనియం-238ను ఇంధనంగా వాడుతుంటారు. ఈ పదార్థం సహజసిద్ధ రేడియోధార్మిక క్షీణతకు గురవుతుంటుంది. దీన్ని ‘ఆల్ఫా డికే’ అంటారు. ఇలా క్షీణించే క్రమంలో భారీగా ఉష్ణశక్తి వెలువడుతుంది. దాన్ని సద్వినియోగం చేసుకోవడం పరమాణు జనరేటర్లలో కీలక సూత్రం.