NIA raids in AP and Telangana: ఎపి, తెలంగాణల్లో NIA మెరుపుదాడులు
-- పౌరహక్కుల ఉద్యమంలో కీలకమైన వారే లక్ష్యంగా
ఎపి, తెలంగాణల్లో NIA మెరుపుదాడులు
— పౌరహక్కుల ఉద్యమంలో కీలకమైన వారే లక్ష్యంగా
ప్రజా దీవెన/హైదరాబాద్:జాతీయ దర్యాప్తు సంస్థ తెలుగు రాష్ట్రాల్లో మెరుపు దాడులకు దిగింది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్ ఐ ఏ ఏకకాలంలో చేపట్టిన దాడులతో (With simultaneous raids by NIA in the states of Andhra Pradesh and Telangana) రెండు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. హైదరాబాద్, వరంగల్ తో పాటు ఏపీలోని తిరుపతి, గుంటూరు, నెల్లూరులో ఏకకాలంలో సోమవారం ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్ అల్వాల్ లో అమర బంధు మిత్రుల సంఘం, పౌర హక్కుల సంఘం నేతల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. పౌరహక్కుల ఉద్యమంలో కీలకంగా పనిచేస్తున్న వారినే లక్ష్యంగా (Targeting those who were instrumental in the civil rights movement) చేసుకుని ఎన్ ఐ ఎ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.
నెల్లూరులో ఏపీ సీఎల్సీ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, పౌరహక్కుల ఉద్యమంలో కీలకంగా పనిచేస్తున్న (He was instrumental in the civil rights movement) అన్నపూర్ణ, అనూష నివాసాల్లో ఎన్ఐఏ సోదాలు చేస్తున్నారు. గుంటూరులో డాక్టర్ రాజారావు, తిరుపతిలో న్యాయవాది క్రాంతి చైతన్య ఇళ్లల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.