Minister Komatireddyvenkatreddy : ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : భోగి సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని రామాలయంలో నిర్వహించిన గోదాదేవి కళ్యాణంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దంపతులు, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అంతకుముందు రాష్ట్ర మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ,రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెలికాఫ్టర్ ద్వారా ఎన్జీ కళాశాల మైదానానికి చేరుకోగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వారికి పుష్పగుచ్చాలని ఇచ్చి స్వాగతం పలికారు .నల్గొండ ఆర్డీవో వై. అశోక్ రెడ్డి, తహసిల్దార్ శ్రీనివాస్, తదితరులు ఉన్నారు .