మండిపడ్డ మంత్రి, అధికారుల నిర్వాకంతో అసహనం
Minister ponnamprabhakar : ప్రజా దీవెన, హుస్నాబాద్ : రాష్ట్ర మంత్రి హోదాలో అధికారుల తీరుపై మండిపడ్డ మంత్రి పొ న్నం ప్రభాకర్ గౌడ్. కొత్త కొండ సంక్రాంతి సందర్భంగా మహా వైభ వంగా జరిగే కొత్తకొండ వీరభద్ర స్వామి సన్నిధి లో మంత్రి పొన్నం ప్రభాకర్ అధికా రుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్వాకం, వసతుల లోపంపై అసహనాన్ని వ్యక్తం చేస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ వసతిగృ హం వద్ద నేలపై కూర్చొని నిరసన తెలిపారు.
రాష్ట్ర బీసీ సంక్షేమ, రవా ణా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతిని ధ్యం వహిస్తున్న హుస్నాబాద్ ని యోజకవర్గం పరిధిలోని భీమదే వరపల్లి మండలం కొత్తకొండ గ్రా మంలో వీరభద్రస్వామి జాతర జరుగుతుం ది. సంక్రాంతి సంద ర్భంగా మహా వైభవంగా జరిగే ఈ జాతరకు వే లాది మంది భక్తులు వస్తుంటారు. జాతర నిర్వహణకు నెల రోజుల ముందు నుంచే ఏర్పాట్లుచేశారు.
అధికారులు, పోలీసు లు, పాలక వర్గానికి జాతర నిర్వహణపై అం తకుముందే మంత్రి పొన్నం ప్రభాకర్ దిశానిర్దేశం చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగ కుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.