Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

In Nalgonda, the candidate has to be changed: నల్లగొండలో అభ్యర్థిని మార్చాల్సిందే

--అధిష్టానానికి బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ అల్టిమేటo -- ఇప్పటికే ఎదురుతిరిగిన పిల్లికి తోడైన మారో పార్టీ గొంతుక కిషన్ రెడ్డి -- కేటీఆర్ పర్యటన రోజే సీనియర్ నేత కిషన్ రెడ్డి అసమ్మతి స్వరం -- తాజగా మరొకసారి బయటపడ్డ బిఆర్ఎస్ పార్టీ వర్గ పోరు

నల్లగొండలో అభ్యర్థిని మార్చాల్సిందే

–అధిష్టానానికి బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ అల్టిమేటo
— ఇప్పటికే ఎదురుతిరిగిన పిల్లికి తోడైన మారో పార్టీ గొంతుక కిషన్ రెడ్డి
— కేటీఆర్ పర్యటన రోజే సీనియర్ నేత కిషన్ రెడ్డి అసమ్మతి స్వరం
— తాజగా మరొకసారి బయటపడ్డ బిఆర్ఎస్ పార్టీ వర్గ పోరు

ప్రజా దీవెన/ నల్లగొండ: నల్లగొండ జిల్లాలో అధికార పార్టీ బి ఆర్ ఎస్ పార్టీలో అసమ్మతి సెగలు కక్కుతూనే ఉన్నాయి. ప్రధానంగా నల్లగొండ జిల్లా కేంద్రమైన నల్లగొండ శాసనసభ్యుడు కంచర్ల భూపాల్ రెడ్డి సొంత పార్టీలోని అసమ్మతి రాగాలు (Dissent tunes in the own party of Kancharla Bhupal Reddy, legislator of Nalgonda district headquarters) రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు ప్రధాన అనుచరునిగా ఉన్న కౌన్సిలర్ పిల్లి రామరాజు యాదవ్ అసమ్మతి బాట పట్టి ఒక కంటిలో నలుసుగా మారిన విషయం తెలిసిందే.

తాజాగా పార్టీలో సీనియర్ నాయకుడు ప్రస్తుత టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి చాలాకాలంగా అసంతృప్తితో( Senior leader and present TRS state secretary Chada Kishan Reddy has been unhappy for a long time) రగిలిపోతున్నారు. ఈ క్రమంలో పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి ఐటి పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు నల్లగొండ పర్యటనకు విచ్చేస్తున్న సందర్భంలో చాడ కిషన్ రెడ్డి ఒక్కసారిగా అసమ్మతి గళం విప్పారు.

టిఆర్ఎస్ పార్టీలో 23 సంవత్సరాలుగా పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన వారిని పక్కన పెట్టి (Leaving aside those who have worked tirelessly for the party for 23 years in the TRS party) మరొక వ్యక్తికి అసెంబ్లీ స్థానాన్ని కేటాయించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూనే అధిష్టానం మీద ఉన్న గౌరవంతో గెలిపించుకుంటే గడిచిన ఐదు సంవత్సరాల నుండి పార్టీకి సంబంధించిన నాయకులపై కార్యకర్తలపై పూర్తి వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు.

ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలలో తన సొంత అనుచరులకు లబ్ధిచేకూర్చే విధంగా వ్యవహరిస్తుంటే జీర్ణించుకోలేక ఇప్పటికే ఎంతో మంది నాయకులు పార్టీ మారడం జరిగిందని, ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో పార్టీ మరింత బలహీనపడే అవకాశం ఉన్నందున ఇప్పుడు ప్రకటించిన అభ్యర్థిని విధిగా మార్చి ( If this continues, the party may become weaker in the coming days, so the candidate announced now must be changed) అందరినీ కలుపుకొని పోయే వ్యక్తినీ అభ్యర్థిగా ప్రకటిస్తే అందరూ సమిష్టిగా కలిసి పనిచేసి గెలుపుంచుకునే అవకాశము ఉంటుందని నేరుగా రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి మీడియాతో అభిప్రాయపడ్డారు.

జిల్లా కేంద్రంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ మంత్రి కేటీఆర్ చేతుల మీదగా అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభానికి, బహిరంగ సభ కూడా కనీసం ఆహ్వానం కూడా అందివ్వడం లేదని (Even the public meeting is not giving even an invitation to start development programs at the hands of IT Minister KTR), పార్టీలో ఉన్న సీనియర్ నాయకులకు అడుగడుగున అవమానాలు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 14 సంవత్సరాలు కేసీఆర్ అడుగుజాడల్లో పార్టీ అభివృద్ధికి కృషి చేసిన నాయకులకు కార్యకర్తలకు కనీస గౌరవ ఇవ్వకపోగా కించపరిచే విధంగా MLA ప్రవర్తన ఉన్నదని విమర్శించారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం నియోజకవర్గంలో రాపిచ్చిన వాల్ రేటింగ్స్ పోస్టర్లని కావాలని ఎమ్మెల్యే తన మనుషులతో తుడిపించడం ( In order to take government welfare schemes to the people, the MLA with his men wants to wipe the wall ratings posters painted in the constituency.) జరిగిందని, ఏదైనా ప్రభుత్వ పథకంలో అర్హులైన కార్యకర్తలు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే మీరు ఫలానా వ్యక్తికి చెందినవారు, మీరు అనర్హులు, మీకు ఎలాంటి పథకాలు వర్తించవని గౌరవంగా మాట్లాడి కించపరచాడని ఆరోపించాడు.

సొంత పార్టీ ఎమ్మెల్యే అవమానాలకు గురి చేస్తుంటే అటువంటి అభ్యర్థి కోసం రానున్న రోజుల్లో ఎలా గెలిపించుకోవాలని (If the MLA is being insulted, how can such a candidate win in the coming days)  కార్యకర్తలు ఆవేదన వెలిబుచ్చుతున్నారని విచారం వ్యక్తం చేశారు. అధిష్టానం ఇప్పటికైనా పునరాలోచించి నల్లగొండ అభ్యర్థి విషయంలో మార్పు కోసం చర్యలు తీసుకోవాలని అధిష్టానాన్ని విజ్ఞప్తి చేశారు.