Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Prisoners should practice good behavior: ఖైదీలు సత్ప్రవర్తనతో మంచిని అలవర్చుకోవాలి

-- తమ శిక్షకాలంలో సంస్కారము, నైపుణ్యము పెంపొందించుకోవాలి -- గాంధీ జయంతి లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం. నాగరాజు

ఖైదీలు సత్ప్రవర్తనతో మంచిని అలవర్చుకోవాలి

— తమ శిక్షకాలంలో సంస్కారము, నైపుణ్యము పెంపొందించుకోవాలి
— గాంధీ జయంతి లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం. నాగరాజు

ప్రజా దీవెన/నల్లగొండ: ఖైదీలు శిక్షకాలంలోనే సంస్కారము, నైపుణ్యము పెంపొందించుకోవడం ( Prisoners develop culture and skills during their imprisonment) ద్వారా ఆరోగ్యవంతులుగా ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం. నాగరాజు కోరారు. సోమవారం 154వ గాంధీ జయంతి తో పాటు ఖైదీల సంక్షేమ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్ర కారాగారంలో గాంధీ విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖైదీలు పరివర్తన చెంది మంచివైపు అడుగులు వేయాలన్నారు.

మనిషి పుట్టుకతోనే ఎలాంటి నేరాలు చేయరని స్వార్ధాలు, ఆవేశం పెరిగి చెడు వైపు పయనిస్తుంటారని పేర్కొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ అహింసతోనే ప్రపంచవ్యాప్తంగా (Father of the Nation Mahatma Gandhi around the world with non-violence) గుర్తింపు పొందారన్నారని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరు సమాజానికి ముప్పు వాటిల్లకుండా జీవించాలని సూచించారు.

బ్రిటిష్ కాలంలో కారాగారాలు చాలా దారుణంగా ఉండేవని, నాడు చిన్న చిన్న సెల్స్ మాత్రమే ఉండి మంచి నీరు, టాయ్లెట్ లు అన్ని అందులోనే ఉండేవని వివరించారు. అండమాన్ నికోబార్ వంటి జైలుకు వెళితే తిరిగి వచ్చేవారు లేరని, కానీ నేడు ఖైదీలకు ఆర్టికల్ 21 ద్వారా స్వేచ్ఛాయుత వాతావరణం లో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు (Today the prisoners are provided with all kinds of facilities in a free environment through Article 21)  తెలిపారు. అంతేకాక జైల్లో ఖైదీలకు పునరావాసం తో పాటు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందున వాటిని సద్వినియోగపర్చుకోవాలన్నారు.

జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ మాట్లాడుతూ జైలుకు వెళ్లిన వారిని ఖైదీలుగా ముద్ర వేసి సమాజంలో చిన్నచూపు చూస్తారన్నారు. ఖైదీలు జైలులో ఉన్నప్పుడు అది శిక్షగా కాకుండా తమలోని ఆలోచనలకు పదును పెట్టి భవిష్యత్తుకు బాటలు (When prisoners are in prison, it is not a punishment but a sharpening of their thoughts and paths for the future) వేసుకోవాలన్నారు. ఇక్కడ చదువుకోవడం లేదా నచ్చిన పని చేయడానికి అవసరమైన వాటిని గుర్తించి సమాజానికి సేవ జరిగేలా కృషి చేయాలన్నారు. మీరు ఖైదీలుగా విడుదలై ఏదైనా రంగంలో రాణించడానికి ప్రభుత్వపరంగా పథకాల ద్వారా తగిన సహకారం అందించేలా ఎంపిడిఓ లకు, తాహాసిల్దార్ లకు ఆదేశాలు ఇస్తామని తెలిపారు.

జిల్లా ఎస్పీ అపూర్వరావు మాట్లాడుతూ నేను ట్రైనింగ్ పీరియడ్లో భాగంగా అనేక జైళ్లను సందర్శించానని, ఎక్కడ ఇలాంటి సౌకర్యాలు లేవని, ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే జైల్లో ఖైదీలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారని ( That only Telangana state provides all kinds of facilities to the prisoners in the jails) తెలిపారు. చంచల్ గూడ జైల్లో ఉన్న సౌకర్యాలను చూసి నేనే ఆశ్చర్యపోయానని, నా బ్యాచ్ మెట్స్ కూడా దేశo మొత్తం అన్ని జైలులను సందర్శించి ఒక్క తెలంగాణలోనే చాలా బాగున్నాయన్న అభిప్రాయం వెలిబుచ్చారని గుర్తు చేశారు. అందులో భాగంగా ఖైదీలకు ఇన్నోవేటివ్, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నందున ఖైదీలు వాటిని వినియోగించుకో వాలన్నారు. ఖైదీలుగా మీరు జైల్లో ఉన్నారంటే తెలిసో తెలియక చేసిన తప్పుల కారణంగానే జైలు పాలయ్యారన్నారని, ఆ విధంగా మీరు కుటుంబానికి దూరం అయ్యారని ఆమె తెలిపారు.

ఈ కార్యక్రమంలో జైలు సూపర్ ఇంటెండెంట్ లకావత్ దేవ్లా, 12వ బెటాలియన్ కమాండెంట్ సత్య శ్రీనివాసరావు, న్యాయ సేవ అధికారి దీప్తి, సబ్ జైలర్ శోభన్ బాబు, నానాఫిషియల్ విజిటర్స్ మామిడి పద్మ, అల్లావుద్దీన్, గుండెబోయిన లింగయ్య, బెళ్లి యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.