–నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అ ధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి
Mohan Reddy : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: యువజన కాంగ్రెస్ లో మంచి వక్త అయితే కాంగ్రెస్ పార్టీలో నాయకునిగా ఎదిగేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి అన్నారు. అఖిల భారత యువజన కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన యంగ్ ఇండియా కే బోల్ కార్యక్రమం సీజన్-5 కి సంబంధించిన పోస్టర్లను గురువారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డి ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో నాయకునిగా ఎదిగేందుకు యువజన కాంగ్రెస్ పునాది లాంటిదని పేర్కొన్నారు. యువజన కాంగ్రెస్ లో కష్టపడి పనిచేసే వారికి మంచి గుర్తింపు భవిష్యత్తు ఉంటుందని అన్నారు.ఇప్పుడున్న మంత్రులు, ఎంపీలు, రాష్ట్ర, జాతీయ కాంగ్రెస్ నాయకులు చాలామంది మొదట యువజన కాంగ్రెస్ లో పనిచేసిన వారేనని పేర్కొన్నారు.పార్టీ ఏ కార్యక్రమాలు ఇచ్చిన యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని పేర్కొన్నారు.
యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డి మాట్లాడుతూ యువజన కాంగ్రెస్ నిర్వహిస్తున్న యంగ్ ఇండియా కే బోల్ కార్యక్రమం యువతకు రాజకీయం, సామాజిక సమస్యలు, దేశ అభివృద్ధిపై చర్చించే ప్రత్యేక వేదికగా రూపొందించబడిందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా యువజన కాంగ్రెస్ దేశంలోని యువతను సంఘటితం చేస్తుందని అన్నారు. యంగ్ ఇండియా కే బోల్ యువత ఆశయాలను ప్రతిబింబించే ఒక ప్లాట్ ఫారంగా పనిచేస్తూ సమాజంపై సానుకూల ప్రభావం చూపిస్తుందన్నారు. నాయకునిగా ఎదిగేందుకు ఇది ఒక వేదికగా పనిచేస్తుందని తెలిపారు.
*ఈ కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు తిరుగుడు రవి యాదవ్, షేక్ జహంగీర్ బాబా, జాల మణికంఠ స్వామి , వల్కి దిలీప్, మునుగోడు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్బనబోయిన రాము యాదవ్, నకిరేకల్ అధ్యక్షుడు ఏనుగు రఘుమారెడ్డి, దేవరకొండ అధ్యక్షుడు కిన్నెర హరికృష్ణ, నాగార్జునసాగర్ అధ్యక్షుడు మల్ రెడ్డి భానుచందర్ రెడ్డి, నల్గొండ పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గాలి నాగరాజు, ఎండి అజారుద్దీన్, మంచి కంటి సిద్ధార్థ, కట్టంగూరు ఆనంద్, దాసరి విజయ్, ఆవుల నందిని శ్రీనివాస్, వివిధ మండలాల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు, యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.