CPM: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: ఉద్యమాల దిక్సూచి, పోరాటాల సారధి, కష్టజీవుల గొంతుక సిపిఐ ఎం రాష్ట్ర మహాసభలు జనవరి 25నుండి 28 వరకు సంగారెడ్డి పట్టణంలో జరుగుతున్నాయని ఆ పార్టీ పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, జిల్లా కమిటీ సభ్యులు ఎండి సలీం పిలుపునిచ్చారు శుక్రవారం 5వ వార్డు గరుడాద్రి కాలనీలో రాష్ట్ర మహాసభలు సందర్భంగా ఇంటింటికి సిపిఎం ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడైనా ప్రజల సమస్యల లో కొట్టుమిట్టా డుతున్న అక్కడ ఆ ప్రజల పక్షాన నికరంగా నిలబడే పోరు కెరటం కష్టజీవుల సిపిఎం సిపిఎం రాష్ట్ర మహాసభలు సందర్భంగా జనవరి 25న సంగారెడ్డి పట్టణంలో జరిగే బహిరంగ సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు.
పేదలు తలదా చుకోవడానికి జానెడు జాగలేక అల్లాడిపోతుంటే ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేసింది సిపిఎం అని అన్నారు లగచర్లలో ప్రజల పక్షాన నిలిచి విజయం సాధించిందని గిరిజనులకు వెన్నుదన్నుగా నిలిచి పోడు సాగుతారు హక్కు పత్రాల సాధన పోరాటంలో అగ్రగామిగా నిలిచింది అని అన్నారు కార్మిక హక్కుల రక్షణ కోసం రైతాంగానికి ఇచ్చిన హామీల అమలు కోసం అందరికీ ఉచిత ఆరోగ్యాన్ని అం దించే ప్రజారోగ్య వ్యవస్థ బలోపే తం కోసం వ్యవసాయ కూలీల అసంఘటిత కార్మికుల కనీస వేతనాల చట్టాల అమలు ప్రజలను కోసం సమీకరించి ఉద్యమాలు నడి పింది సిపిఎం అని అన్నారు.
ఈ మహాసభలలో గత మూడు సంవత్సరాలుగా నిర్వహించిన ప్రజా పోరాటాలను సమీక్షించుకొని జరగబోయే మూడు సంవత్సరాల పోరాటాల కార్యాచరణ రూపొం దించుకోవడం జరుగుతుందని తెలిపారు జనవరి 25న జరిగే బహిరంగ సభకు సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బృందా కారత్ బివి రాఘవులు హాజరవుతున్నా రని తెలిపారు. ఇంటింటి సిపిఎం ప్రచార కార్యక్రమంలో మాజీ కౌన్సి లర్ అవుట రవీందర్ ,పట్టణ కమి టీ సభ్యులు అద్దంకి నరసింహ, ఊట్కూరి మధుసూదన్ రెడ్డి, శాఖ సభ్యులు బొడ్డుపల్లి సైదులు, సంజీవరెడ్డి, పి విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.