Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Breakfast before the scheduled time: అనుకున్న సమయానికన్నా ముందే అల్పాహారం

-- ప్రయోగాత్మకంగా ఈ నెల 6వ తేదీనే అమలుకు సన్నద్దం -- జిల్లాకు ఒక స్కూల్లో పథకం అమలుకు నిర్ణయం

అనుకున్నకన్న ముందే అల్పాహారం

— ప్రయోగాత్మకంగా ఈ నెల 6వ తేదీనే అమలుకు సన్నద్దం
— జిల్లాకు ఒక స్కూల్లో పథకం అమలుకు నిర్ణయం

ప్రజా దీవెన/హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం పధకం అమలు కు రంగం సిద్ధమైంది. అనుకున్న సమయానికి ముందే ప్రయోగాత్మకంగా పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దసరా నాటికి ప్రారంభించాల్సిన సీఎం అల్పాహార పథకాన్ని ఈనెల 6న ప్రారంభించాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది.

అక్టోబర్ 13 నుంచి దసరా సెలవులు ఉండటంతో 6వ తేదీ నుంచే జిల్లాకు ఒక స్కూలులో పైలెట్ ప్రాజెక్టుగా పథకం అమలు చేసి పరిశీలించనుంది. అక్టోబర్ 26న స్కూల్లు పునః ప్రారంభం కానుండగా లోపాలను సరిచేసి అన్ని పాఠశాలలకు పూర్తి స్ధాయిలో విస్తరించాలని భావిస్తుంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నుంచి ఈ పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నట్లు సమాచారo.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎయిడెడ్ స్కూళ్లు 642, మోడల్ స్కూళ్లు 194, మదర్సాలు 100 ఉన్నాయి. వీటిల్లో 1.50 లక్షలకు పైగా విద్యార్థులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనున్నది. విద్యార్థులకు ఇప్పటికే నాణ్యమైన విద్యను అందిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వo మానవీయ కోణంలో పోషకాహారాన్ని అందించేందుకు ఈ వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది.

ఉదయాన్నే విద్యార్థుల ఆకలి బాధలను తీర్చాలన్న సంకల్పంతో అల్పాహార పథకాన్ని అమలు చేయనున్నది. విద్యార్థుల చదువుల పట్ల ఏకాగ్రత పెంచడం, కూలి పనులు చేసుకునే తల్లిదండ్రులకు ఇబ్బంది కలగకూడదన్న ద్విముఖ వ్యూహంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నది.