Braking News : ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరా బాద్ నడిబొడ్డున హబ్సిగూడలో ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. హబ్సిగూడ లోని విజయలక్ష్మి ఆర్కేడ్‌లో షార్ట్ సర్క్యూట్ కార ణంగా ఇరువురు దుర్మరణం పాల య్యారు. స్ధానిక శుభానందిని చిట్ ఫండ్స్ సంస్థ సైన్ బోర్డ్ తీస్తుండగా షార్ట్ సర్క్యూట్‌తో ఇద్దరు మృతి చెందారు.
సమాచారం అందుకొని హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేప ట్టారు. మృతులు సూర్యపేట జిల్లా కేసముద్రం గ్రామానికి చెందిన మల్లే ష్(29), బాలు(32)గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు.