Cricket Tournament: ప్రజా దీవెన, శాలిగౌరారం: నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం పెర్క కొండారం గ్రామంలో నిర్వహించిన ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ లో కొత్తపేట జట్టుకు మొదటి బహుమతి, పెర్కకొండారం జట్టుకు ద్వితీయ బహుమతి లభించింది.ఈ కార్యక్రమంలో ఈరోజు ఫైనల్ మ్యాచ్ గెలుపొందిన కొత్తపేట టీం కు మొదటి బహుమతి మరియు పెర్కకొండారం టీమ్ కు ద్వితీయ బహుమతి ప్రధానం చేయడం జరిగింది.
గెలుపొందిన జట్లకు నగదు పారితోషికం తో పాటుశీల్డను నిర్వహకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు నూక కిషోర్ యాదవ్, శంకర్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ శేగ్గెం శంకర్,కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగదుడ్ల శ్రీనివాస్,బిఆర్ఎస్ సీనియర్ నాయకులు నూక జానయ్య,దుబ్బ వెంకన్న, వేముల బాలరాజు,ఉస్మానియా జెఏసీ నాయకులు దేవరకొండ నరేష్, పుల్గం శంకర్, క్రీడాకారులు నిర్వాహకులు నూక మిత్రసేన్,రమేష్,శివ,వెంకన్న,వీరేందర్,అంజి తదితరులు పాల్గొన్నారు.