–యువత దేహదారుఢ్యం పైన దృష్టి పెట్టాలి
–గ్రామాలలో క్రీడలను ప్రోత్సహిం చాలి
–మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
Komati Reddy Raj Gopal Reddy: ప్రజా దీవెన, మునుగోడు: సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రం లో సంస్థాన్ నారాయణపూర్ ప్రీమియర్ లీగ్ 2025 (సీజన్ 4) క్రికెట్ క్రీడా పోటీలు ముగిసాయి. ఈ కార్యక్రమానికి బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మునుగో డు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైనల్ మ్యాచ్ తిలకించి గెలిచిన క్రీడాకారులకు అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా యువతకు ఫిట్నెస్ చాలా ముఖ్యమని దానికోసం ప్రతి రోజు వ్యాయామం చేయాలన్నా రు.వ్యాయామం వల్ల ఊపిరితిత్తు ల సామర్థ్యం పెరుగుతుందని, క్రీడల వల్ల శారీరక దారిద్యంతో పాటు మానసిక ఉల్లాసం పెరు గుతుందన్నారు. గ్రామాలలో క్రీడ లను ప్రోత్సహించాలని దానికోసం కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత మేము తీసుకుం టామని తెలిపారు. గెలిచిన పుట్ట పాక క్రీడాకారులకు, రుణారపు గమనించిన పోలీస్ క్రీడాకారులకు బహుమతుల ప్రధానోత్సవం చేశారు.