Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Saif Ali Khan : బిగ్ బ్రేకింగ్,సైఫ్‌ అలీఖాన్‌పై దాడి కేసు నిందితుడు అరెస్ట్‌

Saif Ali Khan : ప్రజా దీవెన, హైదరాబాద్: దేశంలో సంచలనం సృష్టించిన ప్రముఖ సినీ నటుడు సైఫ్ అలీ ఖాన్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. సైఫ్ అలీ ఖాన్ పై విచక్షణారహితంగా దాడి చేసిన నిందితుడు మహమ్మద్ సైఫుల్ల ఇస్లాoగా గుర్తించారు. 74 గంటల తర్వాత జల్లడపట్టి మరి నిందితున్ని పట్టుకున్నారు. దీంతో గడిచిన రెండు మూడు రోజులుగా నెలకొన్న ఉత్కంఠతకు తెరపడింది.

సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన మరుక్షణం నుంచి చాకచక్యంగా త ప్పించుకుని తిరుగుతూ పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్న నిందితుడిని ఛత్తీస్‌గఢ్‌ దుర్గ్‌ సమీపంలోని జ్ఞానేశ్వర్‌ ఎక్స్‌ప్రెస్‌లో గుర్తించిన రైల్వే పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఇది లా ఉండగా నిందితుడి కోసం ముంబై పోలీసులు ఛత్తీస్‌గఢ్‌ బయ ల్దేరి వెళ్లారు.

నిందితుడు బంగ్లాదేశీయుడు… సైఫ్ అలీ ఖాన్ విచక్షణారహిత దాడికి పాల్పడిన నిందితుడు మహమ్మద్ సైఫుల్ల ఇస్లాం  బంగ్లా దేశీయుడని ముంబై పోలీసులు వెల్లడించారు. దేశంలోకి అక్రమంగా జొరబడిన సైఫుల్ల ముంబై నగరంలో హౌస్ కీపింగ్ ఏజెన్సీలో మారుపేరుతో చలామణి అవుతున్నాడని చెప్పారు. రైల్వే పోలీసుల నుంచి నిందితున్ని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగిందని, నిందితున్ని పూర్తిస్థాయిలో విచారించిన అనంతరం మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని పోలీసులు పేర్కొన్నారు.