Navodaya exams : ప్రజా దీవెన, కోదాడ: శుక్రవారం పట్టణములోని నవోదయ పరీక్షకు కేటాయించిన పరీక్షా కేంద్రాలు బాయ్స్ హై స్కూల్, గర్ల్స్ హైస్కూల్ రెండు సెంటర్లలో విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షను రాశారు. ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మొత్తం విద్యార్థులు 216 గాను 195 మంది పరీక్షకు హాజరు కాగా 21 మంది విద్యార్థులు హాజరు కాలేదు అదేవిధంగా కోదాడ.
ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల నందు 170 మంది విద్యార్థులకు గాను 147 మంది విద్యార్థులు హాజరు కాగా 23 మంది హాజరు కాలేదు. మొత్తం రెండు సెంటర్లలో కలిపి 386 మంది విద్యార్థులకు గాను 342 మంది హాజరు కాగా 44 మంది విద్యార్థులు పరీక్షకు గైరాజరయ్యారు నవోదయ పరీక్షల సందర్భంగా కోదాడ పట్టణంలో పండగ వాతావరణం నెలకొన్నది