Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Chandrababu : చంద్రబాబు వెనుక మేమున్నాం, అమిత్ షా అభయం

Chandrababu :ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ:ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాల కు కేంద్రం నుంచి సంపూర్ణ సహ కారం ఉంటుందని అమిత్ షా భరో సా ఇచ్చారు. ఎన్డీఆర్ఎఫ్ భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమాంలో ప్రసంగించిన అమిత్ షా కీలక వ్యా ఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో రాష్ట్రం విధ్వంసానికి గురయింద న్నారు. అయితే ఎంత విధ్వంసాని కి గురయిందో అంతకు మూడింత లు సాయం చేసి ఏపీని అభివృద్ధి చేసేందుకు చంద్రబాబుకు సహకరి స్తామన్నారు.అమరావతిని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తే మోదీ ప్రభుత్వం రాగానే రూ. 27 వేల కోట్లను హడ్కో, ప్రపంచ బ్యాంక్ ద్వారా అందించామన్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టులో నీళ్లను 202 8కల్లా పారిస్తామని భరోసా ఇచ్చా రు. స్టీల్ ప్లాంట్ ను లాభాల్లోకి తీసుకు వచ్చేందుకు కేంద్రం కావా ల్సినంత సాయం చేస్తుందన్నారు. అమిత్ షా ప్రసంగం అంతా ఉత్సా హంగా సాగింది.

        తన ప్రసంగంలో చంద్రబాబు ఏయే అంశాలను ప్రస్తా వించారో వాటన్నింటికీ భరోసా ఇచ్చారు. ఆరు నెలల్లోనే మూడు లక్షల కోట్ల వరకూ ప్రాజెక్టులు, సా యం అందించామన్నారు.అంతకు ముందు చంద్రబాబు ప్రసంగంలో ఏపీ వెంటిలేటర్ నుంచి బయటప డినా ఇంకా పేషంట్ గానే ఉంది. ఇటీవలి కాలంలో అమరావతి, పోలవరంకు చేసిన సాయంతో ఏపీకి ఎంతో మేలు జరుగుతుంది. ఈ సహకారం ఇలా కొనసాగాలని విజ్ఞప్తి చేశారు. భారత్ గ్లోబల్ లీడర్ కావాల్సి ఉంది. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, స్పేస్ టెక్నాలజీ, డేటా సైన్స్ రంగాల్లో దృష్టి పెట్టాల్సి ఉంది. ప్రధాని మోదీ నాయకత్వం లో 2047 కల్లా భారత్ నెంబర్ వన్ అవుతుంది. ఎవరూ ఆపలేరన్నా రు. గత ఆరు నెలల కాలంలో కేంద్రం ఎంతో సహకరిచిందని కీలక మైన ప్రాజెక్టుల్ని కేటాయించారని అన్నారు. పవన్ కల్యాణ్ కూడా కేంద్రం అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.