*డప్పుతో దరువు వేద్దాం.. ఎస్సి వర్గీకరణ సాధిద్దాం
Thotapalli Nagaraju : ప్రజా దీవెన,కోదాడ: ఫిబ్రవరి 7వ తారీకున హైదరాబాద్ లో వెయ్యి గొంతుకలు లక్ష డబ్బులు కార్యక్రమానికి మాదిగ జర్నలిస్టులందరూ హాజరుకావలని జర్నలిస్ట్ రాష్ట్ర నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణములు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలోఎం జె ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి తోటపల్లి నాగరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పిడమర్తి గాంధీ,రాష్ట్ర నాయకులు బంక వెంకటరత్నం మాదిగలు హాజరై మాట్లాడుతూ..
వెయ్యి గొంతుకల లక్ష డబ్బుల మహా ప్రదర్శన కు కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న మాదిగ జర్నలిస్టు తరలిరావాలని వారు పిలుపునిచ్చారు.ఎస్సి వర్గీకరణ సాధకుడైన మంద కృష్ణ నాయకత్వంలోనే ఎస్సి వర్గీకరణ సాధ్యమని, తెలిపారు ఫిబ్రవరి 7న హైదరాబాద్ నగరంలో తలపెట్టిన వేయ్యి గొంతులు లక్ష డబ్బులు కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు.అలాగే కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా మాదిగ జర్నలిస్టుల నూతన కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు ఈ సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో పడిశాల రఘు మాతంగి సురేష్, చీమ చంద్రశేఖర్, ఏపూరి సునిల్ రత్నాకర్, మందుల రాంబాబు, నేలమర్రి శ్రీకాంత్, తోళ్ల గురునాథం తదితరులు పాల్గొన్నారు.