Dengue Danger Bells: డెంగ్యూ డేంజర్ బెల్స్
-- ఆసుపత్రుల్లో అంతకంతకూ పెరుగుతోన్న రోగులు -- రోగుల మెదడుపై ప్రభావం చూపుతున్నట్లు వెల్లడి
డెంగ్యూ డేంజర్ బెల్స్
— ఆసుపత్రుల్లో అంతకంతకూ పెరుగుతోన్న రోగులు
— రోగుల మెదడుపై ప్రభావం చూపుతున్నట్లు వెల్లడి
ప్రజా దీవెన/ హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా డెంగ్యూ జ్వరం కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లో డెంగ్యూ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ ఆసుపత్రుల్లో రోగులు ( The number of dengue victims in the districts is increasing day by day and patients in the hospitals) కిటకిటలాడుతున్నారు. డెంగ్యూ లక్షణాలు రోగుల్లో తీవ్ర స్థాయిలో కనిపించడంతో రోగులు ఆసుపత్రులకు పరుగులు పరుగులు పెడుతున్నారు.
జ్వరం, తలనొప్పితో పాటు శరీరంపై ఎర్రటి దద్దుర్లు, శ్వాస తీసుకోవడంలో అవస్థలు పడుతున్నారు. ఇదే సందర్భంలో డెంగ్యూ బారిన పడిన రోగుల మెదడుపై కూడా ప్రభావం చూపుతున్నట్లు తాజా పరిశోధనల్లో ( In the latest research, it also affects the brain of dengue infected patients) వెల్లడైంది. వైద్య నిపుణులు పేర్కొంటున్న విదంగా డెంగ్యూ జ్వరం కారణంగా షాక్ సిండ్రోమ్‌తో బాధపడుతున్న రోగుల మెదడు ఈ జ్వరంతో ప్రభావితమైనట్లు పలు అధ్యయనాల్లో కూడా బయటపడింది.
దీంతో డెంగ్యూ రోగుల్లో పక్షవాతం లక్షణాలు కనిపిస్తున్నట్లు వైద్యులు పేర్కంటున్నారు. రోగుల్లో నెలకొన్న లక్షణాల మేరకు తగిన చికిత్స అందిస్తున్నారు. శరీరంలోని వివిధ భాగాలను దెబ్బతీసే అనేక రకాల డెంగ్యూజాతులు ఉన్నాయని ( There are several types of dengue that affect different parts of the body) వైద్యులుచెబుతున్నారు. అయితే మెదడుపై దీని ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది.
శరీరంలో డెంగ్యూ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే ఏ అవయవమైనా దెబ్బతింటుందని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి సీనియర్ రెసిడెంట్ డాక్టర్ దీపక్ కుమార్ సుమన్ చెబుతున్నారు. కొంతమంది డెంగ్యూ రోగుల్లో బహుళ అవయవ వైఫల్యం సంభవిస్తున్న ( Multiple organ failure occurs in dengue patients) కారణంగా రోగులు మరణిస్తారు.
మెదడుపై డెంగ్యూ ప్రభావాన్ని డెంగ్యూ ఎన్సెఫాలిటిస్ గా పేర్కొంటుoడగా డెంగ్యు సోకిన రోగి మెదడు ఉబ్బిపోయి దాని కారణంగా అతను అపస్మారక స్థితికి చేరుకునే అవకాశాలూ (The patient’s brain swells and chances are that he will become unconscious) లేకపోలేదు. సదరు సమస్య తలేత్తేoదుకు వయసు తో నిమిత్తం లేదని స్పష్టం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా డెంగ్యూకి ఇంట్లో స్వయంగా చికిత్స చేసుకోవడం సరికాదని ఎయిమ్స్‌లోని మెడిసిన్ విభాగంలో డాక్టర్ నీరజ్ నిశ్చల్ హెచ్చరించారు. ఏదో ఒక మందు వాడే ముందు వైద్యుడిని సంప్రదించడం చాలా అవసరం. డెంగ్యూ వచ్చినప్పుడు శరీరంలో తగినన్ని నీళ్లు ఉండేలా చూసుకుంటూ (Keeping enough water in the body during dengue) ఎల్లప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉండేలా జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు.
జ్వరం ఎక్కువగా ఉంటే పారాసెటమాల్ తీసుకోవచ్చు. కానీ ఇంటి వద్దనే ఉంటూ పూర్తి స్వయం చికిత్స తీసుకోకుండా వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు.