Etela Rajender : ప్రజా దీవెన, మేడ్చల్ : మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఆగబ ట్టలేని ఆగ్రహాన్ని వెలిబు చ్చారు. కట్టలుతెంచుకున్న కోపoతో ఊగిపోతూ ఓ వ్యక్తిని ఎడాపెడా వాయించాడు.ఎప్పుడు సౌమ్యంగా మాట్లాడే ఈటెల రాజేందర్ కు ఇంతలా ఆగ్రహం రావడం అంద రిని ఆశ్చర్యానికి గురిచేసినా ఆ కోపం వచ్చింది ఎందుకో తెలుసా అంటే పేదల స్థలాలను రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కబ్జా చేశారనే సమా చారంతో ఇలా దాడికి పాల్పడ్డారు. ఈటల రాజేందర్ కు మొదటిసారి వచ్చిన ఆగ్రహం కథాకమీషు ఇలా ఉంది. మేడ్చల్ జిల్లా పోచారంలో మంగళవారం బిజెపి ఎంపీ ఈటెల రాజేందర్ పర్యటించారు. ఈ సంద ర్భంగా స్థానిక బిజెపి నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికా రు. అనంతరం స్థానిక సమస్యలపై ఈటల ఆరా తీశారు. బిజెపి నాయ కులు ఒక్కొక్కరిగా సమస్యలను వి వరిస్తున్న క్రమంలో రియల్ ఎస్టేట్ బ్రోకర్ల వ్యవహారం ఈటెల రాజేంద ర్ దృష్టికి వచ్చింది.
ఏకశిలా నగర్ లో పేదల భూములను రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అక్రమంగా అక్రమి స్తున్నారని, అంతేకాకుండా బెది రింపులకు పాల్పడుతున్నట్లు బిజె పి నాయకులు ఆయన దృష్టికి తీ సుకువచ్చారు.ఇక అంతే ఈటెల రాజేందర్ కు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అక్కడే కదా రియల్ ఎస్టేట్ బ్రోకర్ని పిలిచి ఏకంగా చేయి చేసుకున్నారు. ఈటెల రాజేందర్ బ్రోకర్ చంప పగలగొట్టడంతో స్థా నిక బిజెపి నాయకులు కూడా అదే తరహాలో అతనిపై దాడికి పాల్ప డ్డారు. పేదల భూములను కబ్జా చేస్తే సహించేది లేదని, ఇటువంటి వారిని గుర్తించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈటల డిమాండ్ చేశారు. ఎంపీ ఈటెల దాడికి పాల్పడిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి ఈ వ్యవహారంపై ఆ రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడ
BJP MP etela Rajender agressive on land grabbing man pic.twitter.com/16I53KVbS2
— praja deveena web site and digital edition e paper (@PDeveena40655) January 21, 2025