–ఇరు పార్టీల నేతల నోట బూతు పురాణం
–పోలీసుల సమయస్ఫూర్తితో సద్దుమణిగిన వివాదం
Bhupal Reddy : ప్రజా దీవెన నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలో అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు బాహాబాహికి దిగా రు. కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీల నేత ల మధ్య నువ్వా నేనా అన్న రీతి లో కొనసాగిన వివాదంతో నల్లగొం డ మున్సిపల్ కార్యాలయం మంగ ళవారం రణరంగంలా మారింది. కేటీఆర్ రాక సందర్భంగా బీ ఆర్ఎ స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించడం పై కమిషనర్ ను కలి సేందుకు మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, పలువురు పార్టీ నాయకులతో కలిసి మున్సిపల్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ కమిషనర్ లేకపోవడంతో ఆయన చాoబర్ లో బైఠాయించారు. దీం తో ఆయన కోసం వేచి ఉన్న భూ పాల్ రెడ్డిని, కార్యకర్తలను పోలీ సులు ఛాంబర్ నుండి వెళ్లిపొమ్మని సూచించారు. కమిషనర్ వచ్చేదా కా వెళ్లబోమని చెప్పడంతో పోలీసు లు వారిని బలవంతంగా ఛాంబర్ నుండి బయటికి పంపించే ప్రయ త్నం చేశారు. కంచర్ల భూపాల్ రెడ్డి ని కూడా పోలీసులు బయటకు వెళ్లమని కోరగా ఆయన అలాగే కూర్చోవడంతో పోలీసులు ఆయ నను బలవంతంగా బయటికి తీసు కొచ్చారు. ఆ సందర్భంలో కంచర్ల భూపాల్ రెడ్డి తీవ్ర వాగ్వివాదానికి దిగడంతో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.
ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చేస్తున్న సమయంలో మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి కార్యకర్తలతో మున్సి పల్ కార్యాలయానికి చేరుకోవ డంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రి క్తంగా మారింది. బుర్రి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలతో తమను ఎలా అరెస్ట్ చేస్తారని కంచర్ల భూపాల్ రెడ్డి పోలీసులతో వాగ్వివాదానికి దిగా రు. ఈ సందర్భంలో జరిగిన తోపులాటలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల గొడవలో కార్యాలయం లోని ఫర్నిచర్, పూలకుండీలు ధ్వం సం అయ్యాయి. మున్సిపల్ కమిష నర్, పోలీసులు కాంగ్రెస్ ఏజెంట్లలా పనిచేస్తున్నారని భూపాల్ రెడ్డి ఆరోపించారు. కోమటిరెడ్డి వెంకటరె డ్డి ఆదేశాలతో ఆయన అనుచరు లు తమను అక్రమంగా అరెస్టు చే యించారని దీనికి తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరిం చారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో నల్లగొండ మాజీ” మున్సి పల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చీర పంకజ్ యాదవ్, పట్టణ పార్టీ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్ తదితరులు ఉన్నారు.
ప్రజా క్షేత్రంలో గుణపాఠం తప్పదు.. ఉమ్మడి జిల్లా మంత్రి హోదాలో తాను చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమేనా అని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుం టకండ్ల జగదీష్ రెడ్డి మంత్రి కోమటి రెడ్డికి సవాల్ విసిరారు. నల్లగొండ ను రూ. 1500 కోట్లతో అభివృద్ధి చేశానన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజా క్షేత్రంలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కాంగ్రెస్ నేతలు రైతు భరోసాను ఎగ్గొట్టారు, పంట లు వేయడం లేదు అందుకే భరోసా ఇవ్వడం లేదని రైతులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని విమర్శిం చారు. రుణమాఫీ, బోనస్ ఇలా అన్ని విషయాల్లో కాంగ్రెస్ రైతుల ను మోసం చేసిందని ఆరోపించా రు. కాంగ్రెస్ ప్రభుత్వంపై వచ్చిన ప్రజా వ్యతిరేకతకు ఈరోజు నిర్వ హించిన గ్రామసభలే నిదర్శనమ న్నారు. ఇప్పటివరకు డైవర్షన్ పాలి టిక్స్ చేసిన కాంగ్రెస్ నాయకులు ప్రజలు చేతి నుండి తప్పించుకో లేని పరిస్థితులున్నాయని అన్నా రు.
కేటీ-ఆర్ పేరు వింటేనే కాంగ్రెస్ భయపడుతోందని అన్నారు. అం దుకే నల్లగొండ పట్టణంలో కేటీ-ఆర్ పర్యటన ను అడ్డుకున్నారని. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న బీ ఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు బనా యిస్తూ అరెస్టు చేయిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదని హితవు చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి రోజులు దగ్గర పడ్డాయని త్వరలో వాడు కనుమరుగు కావడం ఖాయమని జగదీష్ రెడ్డి జోస్యం చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ ఉన్నారు.