Mohammed Latif : ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారు. మొహమ్మద్ లతీఫ్
Mohammed Latif : ప్రజా దీవెన, నల్గొండ రూరల్: నల్గొండ మండల పరిధిలోని ఖాజీ రామారం గ్రామంలో నిర్వహించిన గ్రామ సభ పారదర్శకంగా జరగలేదని అధికారులు సూచించిన పేర్లలో అర్హులకు అవకాశాలు దక్కడం లేదని కాజీరామారం గ్రామానికి చెందిన మొహమ్మద్ లతీఫ్ ఆవేదన వ్యక్తం చేశారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రజలను మభ్యపెట్టడానికి సంక్షేమ పథకాల పేరుతో ప్రభుత్వం కొత్త నాటకం ఆడుతుంది అని లతీఫ్ తెలిపారు..
ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో అవతకవతలు జరుగుతున్నాయి అని ..అధికారుల లోపం ఉంటే సరిచేసి అర్హులకు సంక్షేమ పథకాలు అందే విధంగా అధికారులు సహకరించాలని కోరారు. గ్రామంలోని వికలాంగులను దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పథకాలలో మొదటి ప్రాధాన్యత వారికి కల్పించాలని లతీఫ్ తెలిపారు