Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Economic Forum : దావోస్ లో తెలంగాణ ధమాక

–రూ. 1.32 లక్షల కోట్లతో వెల్లువె త్తుతోన్న పెట్టుబడులు
–కొత్త ఒప్పందాలతో 46 వేల మం దికి ఉద్యోగాల అవకాశాలు
–పది సంస్థలతో ఒప్పందాలు చేసు కున్న ప్రభుత్వం
–గత ఏడాదితో పోలిస్తే మూడింత లు పెరిగిన వైనం

Economic Forum : ప్రజా దీవెన, హైదరాబాద్: దావోస్ లో పెట్టుబడుల సమీకరణలో తెలంగాణ సరికొత్త రికార్డులు నెల కొల్పింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర చరిత్రలో భారీ పెట్టు బడుల రికార్డు నమోదు చేసింది. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో ఇప్పటికే రూ.1.32 లక్షల కోట్ల పెట్టుబడులను తెలంగాణ సా ధించింది. గత ఏడాది దావోస్ పర్యటనలో రాష్ట్రానికి రూ.40,2 32 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అప్పటితో పోలిస్తే ఈసారి మూ డింతలకు మించిన పెట్టుబడులు రావటం విశేషంగా చెబుతున్నారు.

 

దావోస్ వేదికపై ఈసారి తెలంగాణ రాష్ట్రం అందరి దృష్టిని ఆకర్షించిం ది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సారధ్యంలో తెలంగా ణ రైజింగ్ బృందం దావోస్ లో వివిధ పారిశ్రామికవేత్తలతో నిర్వ హించిన సమావేశాలన్నీ విజయ వంతమయ్యాయి. హైదరాబాద్ లో ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి రాష్ట్ర ప్ర భుత్వం ప్రాధాన్యమివ్వటం ప్రపంచ దిగ్గజ పారిశ్రామికవేత్తలను అమి తంగా ఆకట్టుకుంది. దీంతో పాటు యంగ్ ఇండియా స్కిల్ యూనివ ర్సిటీ, రీజనల్ రింగ్ రోడ్డు నిర్మా ణం, మెట్రో విస్తరణకు ప్రభుత్వం ఎంచుకున్న భవిష్యత్తు ప్రణాళికలు పెట్టుబడుల వెల్లువకు దోహదప డ్డాయి.

 

రాష్ట్ర ప్రభుత్వం ఎంచు కున్న తెలంగాణ రైజింగ్ 2050 విజన్ గేమ్ ఛేంజర్గా నిలిచింది. అన్ని రంగాలకు అనుకూలమైన వాతావరణమున్న హైదరాబాద్ గ్రేటర్ సిటీ పెట్టుబడుల గమ్య స్థానంగా మరోసారి ప్రపంచానికి చాటిచెప్పినట్లయింది. రాష్ట్ర ప్రభు త్వం అమలు చేస్తున్న సరళతర పారిశ్రామిక విధానంతో పాటు ఇటీ వల ప్రకటించిన క్లీన్ అండ్ గ్రీన్ పాలసీ ప్రపంచ పారిశ్రామికవేత్తల ను దృష్టిని ఆకర్షించింది. దేశ విదే శాలకు చెందిన పేరొందిన పది ప్రముఖ కంపెనీలతో రాష్ట్ర ప్రభు త్వం ఒప్పందాలు చేసుకుంది. ఐటీ, ఏఐ, ఇంధన రంగాల్లో అంచ నాలకు మించినట్లుగా భారీ పెట్టు బడులను సాధించింది. దావోస్ లో వరుసగా మూడు రోజుల పాటు ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పం దాల ప్రకారం రూ.1.32 లక్షల కోట్ల పెట్టుబడులతో పాటు రాష్ట్రంలో దాదాపు 46 వేల మంది యువత కు ఉద్యోగాలు లభించనున్నాయి.

 

హైదరాబాద్‌లో విప్రో విస్తరణ…విప్రో కంపెనీ హైదరాబాద్లో తమ క్యాంపస్ విస్తరించనున్నట్లు ప్రకటిం చింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని గోపనపల్లి లో కొత్తగా మరో ఐటీ సెంటర్ నెలకొల్పనుంది. దీంతో అదనంగా 5000 మందికి ప్రత్య క్షంగా పరోక్షంగా ఉద్యోగాలు లభి స్తాయి. దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ తో సమావేశమయ్యారు. అనం తరం ఈ కీలక ప్రకటన విడుదల చేశారు.హైదరాబాద్‌లో ఐటీ రంగం వృద్ధిలో విప్రో కీలక భాగస్వామి. విప్రో క్యాంపస్ విస్తరణతో రాష్ట్రం లో సాంకేతిక రంగం మరింత వృద్ధి చెందనుంది. ఐటీ రంగంలో ఉపాధి అవకాశాలు పెరుగనున్నాయి. కొత్త ఐటీ సెంటర్ రాబోయే రెండు మూడేండ్లలో పూర్తవుతుంది. ప్రభు త్వంతో విప్రో చేసుకున్న ఒప్పం దంతో ప్రపంచ ఐటీ పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణ ఖ్యాతి మరింత బలోపేతమవుతుంది.

 

 

 

విప్రో విస్తరణ ప్రణాళికను ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి స్వాగతించా రు. విప్రో లాంటి పేరొందిన సంస్థల కు తగిన మద్దతు ఇచ్చేందుకు, వ్యాపారాలకు అనువైన వాతావ రణం కల్పించేందుకు తమ ప్రభు త్వం కట్టుబడి ఉంటుందన్నారు. కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహిం చేందుకు, అవకాశాలు సృష్టించడా నికి తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం తమకు ఉత్సాహంగా ఉందని ఈ సందర్భంగా విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ అన్నారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ నైపుణ్యా భివృద్ధి కార్యక్రమాలలో భాగస్వా మ్యం పంచుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు విప్రో కంపెనీని ఆహ్వానిం చారు.

 

హైదరాబాద్ లో ఇన్ఫోసిస్ భారీ విస్తరణ… ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ హైదరాబాద్‌ లో తమ ఐటీ క్యాంపస్ ను విస్త రించనుంది. పోచారంలో ఉన్న ఇన్ఫోసిస్ క్యాంపస్ లో అదనంగా 17 వేల ఉద్యోగాలు కల్పించను న్నట్లు ఇన్పోసిస్ ప్రణాళికను సిద్ధం చేసింది. అందుకు అనుగుణంగా అక్కడున్న సదుపాయాలను విస్త రించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. దావోస్ ప్ర పంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సు లో ఇన్ఫోసిస్ సీఎఫ్వో జయేష్ సంగ్రాజ్కా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబుతో సమావేశమయ్యారు. అనంతరం ఈ ప్రకటన విడుదల చేశారు.

 

 

ఈ ఒప్పందంలో భాగంగా ఫస్ట్ ఫేజ్లో ఇన్ఫోసిస్ సంస్థ రూ. 750 కోట్ల పెట్టుబడితో కొత్త ఐటీ భవ నాల నిర్మాణం చేపడుతుంది వచ్చే రెండు మూడేండ్ల లో ఈ నిర్మాణం పూర్తవుతుంది, ఈ కొత్త సెంటర్ రాష్ట్రంలో అభివృద్ధి చెందు తున్న ఐటీ పర్యావరణ వ్యవస్థకు గణనీయంగా దోహదపడుతుంది దేశంలో ప్రముఖ ఐటీ గమ్యస్థానం గా తెలంగాణ ప్రతిష్టను మరింత పెంచుతుంది.ఇప్పటికే ఇన్ఫోసిస్ హైదరాబాద్ లో దాదాపు 35000 మంది ఉద్యోగులున్నారు. తెలం గాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకోవటం కొత్త ఆవిష్కరణ లకు నాంది పలుకుతుందని, ఇప్పుడున్న ఐటీ సమూహాన్ని మరింత బలోపేతం చేయాలనే ఉమ్మడి దృక్పథాన్ని ప్రతిబింబి స్తుందని జయేష్ సంగ్రాజ్ అన్నా రు.రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేసే లక్ష్యంతో అన్ని రంగాల్లో ప్ర ముఖ సంస్థలు, పారిశ్రామిక దిగ్గ జాలకు ప్రభుత్వం తగినంత మద్ద తు ఇస్తుందని మంత్రి శ్రీధర్బాబు స్పష్టం చేశారు.

 

 

అమెజాన్ తో భారీ ఒప్పందం దావోస్లో పెట్టుబడుల సమీకరణలో ఇప్పటికే కొత్త రికార్డు నెలకొల్పిన తెలంగాణ మరో భారీ పెట్టుబడిని సాధించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దావోస్‌లో అ తి పెద్ద పెట్టుబడి ఒప్పందాన్ని కుదుర్చుకుంది.హైదరాబాద్ లొ రూ.60,000 కోట్లు పెట్టుబడి పెట్టేం దుకు అమెజాన్ కంపెనీ అంగీక రించింది.డేటా సెంటర్లలో పెట్టుబ డులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తో ఒప్పందం చేసుకుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు అమెజాన్ వెబ్ సర్వీసెస్ గ్లోబల్ పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ మైఖేల్ పుంకేతో భేటీ అయ్యారు. దాదాపు రూ. 60000 కోట్ల పెట్టుబడుల ప్రణాళికలతో హైదరాబాద్‌లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ తమ డేటా సెంటర్‌లను పెద్ద ఎత్తున విస్తరిస్తోంది. భవి ష్య త్తులో అర్టిఫిషియల్ ఆధారిత క్లౌడ్ సేవల వృద్ధికి ఈ డేటా సెంటర్లు కీలకంగా మారనున్నాయి.

 

తెలంగాణలో తన క్లౌడ్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయ డానికి 2030 నాటికి 4.4 బిలియన్ డాలర్ల పెట్టుబడులను అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఇప్పటికే ప్రకటిం చింది. ఒక బిలియన్ పెట్టుబడు లతో రాష్ట్రంలో మూడు సెంటర్లను గతంలోనే అభివృద్ధి చేసింది. ఈ మూడు కేంద్రాలు ఇప్పటికే పని చేస్తున్నాయి.కొత్తగా చేపట్టే విస్త రణ ప్రణాళికలకు అవసరమైన భూమిని కేటాయించాలని అమె జాన్ వెబ్ సర్వీసెస్ రాష్ట్ర ప్రభు త్వాన్ని అభ్యర్థించింది. రాష్ట్ర ప్రభుత్వం అందుకు అంగీకరిం చింది. అమెజాన్ వంటి ప్రపంచ దిగ్గజ కంపెనీలు మన రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ పెట్టుబడులకు ముందుకు రావటం ఆనందంగా ఉందని ము ఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రైజింగ్ విజన్ తో ప్రజా ప్రభుత్వం ఏడాదిగా చేపట్టిన ప్రయ త్నాలు ఫలించాయని అన్నారు.
ఈ ఒప్పందంతో హైదరాబాద్ దేశం లో డేటా సెంటర్ల కేంద్రంగా తిరుగు లేని గుర్తింపు సాధిస్తుందని ఐటీ మంత్రి డి. శ్రీధర్ బాబు అన్నారు.