Ramana Murthy : ప్రజా దీవెన , పెద్దపల్లి: రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఆనంద రావు నుండి రూ.10 వేలు లంచం తీసు కుంటుండగా రామగుండం ఎస్టిఓ, సబార్డినేట్ లను గురువారం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వివరా లిలా ఉన్నాయి. పదవి విరమణ పొందిన ఉపాధ్యాయుడు ఆనంద రావు తన పెన్షన్ మంజూరు, ఏరి యర్స్, ఇతరాత్ర బెనిఫిట్స్ కు సం బంధించిన బిల్లులను మంజూ రు చేయాలని పెద్దపల్లి జిల్లా రామ గుండం సబ్ ట్రెజరీ ఆఫీసర్ ను కోరాడు.
అయితే వారు డబ్బులు డిమాండ్ చేయ డంతో కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ రమణ మూర్తిని కలిసి లంచం అడిగిన విషయాన్ని వెల్లడించారు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు గురువా రం రిటైర్డ్ ఉపాధ్యాయుడి నుండి 10 వేలు లంచం తీసుకుంటున్న ఎస్టీఓ మహేశ్వర్, సబార్డినేట్ పవన్ లను పట్టుకున్నారు. అనం తరం కెమికల్ టెస్ట్ నిర్వహించి వాంగ్మూలాలు తీసుకుని నింది తులను కరీంనగర్ ఏసీబీ స్పెషల్ కోర్ట్ లో హాజరుపర్చారు.