Thief : ప్రజా దీవెన, తిప్పర్తి:తిప్పర్తి మండల కేంద్రంలో రొట్టెల జానయ్య అనే రైతు తన ఇంటి ముందు పశువుల పాకలో వున్న రెండు ఎడ్లను సంక్రాంతి పండుగ రోజున గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుక వెళ్లినారనే ఫిర్యాదిపై తిప్పర్తి పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు అయినది.ఇట్టి కేసు విచారణలో భాగంగా గురువారం ఉదయం అనిశెట్టి దుప్పలపల్లి గ్రామంలో అనుమానస్పద రీతిలో ఒక నిసాన్ కారు తిరుగుతుండగా అనుమానం వచ్చి తనిఖీ చేయగా దొంగలు పట్టు పడ్డారు.
ఇట్టి కారులో ఉన్న వ్యక్తి తనతో పాటుగా మరో ఇద్దరు కలిసి గత 6 నెలల కాలంలో తిప్పర్తి,కట్టంగూరు, నార్కెట్పల్లి పోలీస్ స్టేషన్ ల పరిది లో జాతీయ రహదారుల వెంబడి ఉన్న గ్రామాల్లో ఉన్న పశువుల కు రాత్రి పూట మత్తు మందు ఇచ్చి వాటిని కారు వెనకభాగం లో కుక్కి దొంగతనం చేసి హైదరాబాద్ లో వదించి కిలోల చొప్పున విక్రయించి లాభం పొందుతారని నేరం ఒప్పుకొన్నారు
నేరస్తుల వివరాలు మహమ్మద్ అమీర్ ఖురేషి (34 సం),మహమ్మద్ జమీల్ ఖురేషి (25 సం) (పరారి)
,సయ్యద్ రఫీదిన్ (27 సం) (పరారీ) పై వారందరూ రాజేంద్రనగర్ రంగారెడ్డి జిల్లాకు చెందినవారు.
నేరస్తుడైన అమీర్ ఖురేషి నుండి 4 కేసుల్లో కారు,రెండు ఎడ్లతో పాటు
కొంత నగదు మరియు
మత్తుమందు బుడ్డి ,సిరంజి ని
రికవరీ చేసినేరస్తుడైన అమీర్ కురేషిని రిమాండ్ కు తరలించడమైనది అని తెలిపారు మిగతా నేరస్తులైన జమీల్ ఖురేషి, సయ్యద్ రఫీ ఉద్దీన్ పరారీలో ఉన్నారు మహమ్మద్ అమీర్ ఖురేషి పై ఇప్పటి వరకు 10 పశువుల దొంగతనం కేసులు నమోదైనవి అని తెలియజేశారు.రాత్రిపూట ఎవరైనా అనుమానస్పద స్థితిలో కనిపిస్తే తప్పక పోలీసులకు సమాచారం అందించాలని సిబ్బంది తెలిపారు..