Pastor Sundar Rao : ప్రజా దీవెన, కోదాడ:పాస్టర్ యెసయ్య ఆధ్వర్యంలో స్థానిక నయా నగర్ బాప్టిస్ట్ చర్చిలో ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్రాలలో తగలబడుతున్న అడవులు ఇండ్లను ప్రమాదంలో సర్వం కోల్పోయి నిరాశలైపోయి రోడ్డున పడిన వారి కొరకు కాకుండా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని మంటల్లో
ప్రతి ఒక్కరి విలువైన గృహాలు అగ్నికి ఆవుతైపోతుంటే గుండె తరుముక్కుపోతుంది తెలిపారు. ఆకస్మిక ప్రమాదాల నుంచి ప్రభుత్వాలు తప్పించాలని ప్రజలు వాతావరణ సంబంధమైన మార్పులకు అనుగుణంగా జీవించాలని తెలియజేశారు ప్రార్థనల ద్వారా త్వరగా రెండు రాష్ట్రాలు కోలుకోవాలని ప్రభువును వేడుకున్నారు.ఈ కార్యక్రమంలో పాస్టర్ సుందర్రావు ప్రభుదాస్ రాజేష్ దేవ సహాయం డేవిడ్ రాజు సుధాకర్ రాజు రవికాంత్ జాషువా తదితరులు పాల్గొన్నారు.