Burri srinivasreddy : పానగల్ అభివృద్ధికి అన్ని విధాలా పాటుపడుతాం
-- నల్లగొండ మునిసిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి
పానగల్ అభివృద్ధికి అన్ని విధాలా పాటుపడుతాం
— నల్లగొండ మునిసిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి
Burri srinivasreddy : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్లగొం డ పట్టణంలోని చారిత్రాత్మక ప్రాంతమైన పానగల్ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం పానగల్ లోని 2వ వార్డులో మున్సి పల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, స్థానిక వార్డు కౌన్సిలర్ బుర్రి రజి త యాదయ్యతో కలిసి ఎస్సీ కాలనీ స్మశాన వాటిక స్నానాల గదు ల నిర్మాణ పనులకు, మైనార్టీ స్మశాన వాటిక నుంచి డ్రైనేజీ నీళ్లు తొల గించు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ పానగల్ లో ప్రతి వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చే స్తానని స్పష్టం చేశారు.
కాలనీలలో డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులన్నింటిని పూర్తి చేయించి పాన గల్ ప్రాంతాన్ని మరింత శాసశ్యామలం చేస్తానని అన్నారు.మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో నల్లగొండ పట్టణాన్ని అన్ని విధా లుగా అభివృద్ధి చేయ డం జరుగుతుందని పేర్కొ న్నారు. ఇప్పటికే కోట్లాది రూపా యలతో పట్టణంలోని 16 వార్డులలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు జరుగుతున్నాయని వెల్లడించారు.
పానగల్ లోని కాలనీలలో ఎలాంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ వార్డుల కౌన్సిలర్లు బొజ్జ శంకర్, గణేష్,ఇబ్రహీం,గడిగే హిమబిందు శ్రీనివాస్, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు పల్ రెడ్డి వెంకట్ రెడ్డి, తక్కెళ్ళ జంగయ్య, బుర్రి కృష్ణ శేఖర్, కొప్పు సత్తయ్య, గుండగోని యాదయ్య,అశోక్, గుండగోని శ్రీనివాస్, అలెక్స్, హర్ష, జానీ, సురేష్, వసీం, మజీద్, తహేర్, మోయిన్ తదితరులు పాల్గొన్నారు.