— రోడ్లు భవనాల శాఖమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
Komati Reddy Venkata Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: రానున్న వేస విలో నల్గొండ పట్టణానికి నిరం తర విద్యుత్ సరఫరా ఉండేలా ప్రత్యామ్నాయ ఫీడర్ ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమ టిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నల్గొం డ పట్టణానికి విద్యు త్తు డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని పట్టణం నలువైపులా సబ్ స్టేష న్లు ఏర్పాటు చేసి డిమాండ్ కు తగ్గ సరఫరాను ఇస్తున్నామని తెలిపారు. శనివారం అయన నల్గొండ పట్టణంలోని బీట్ మార్కెట్లో 3 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 33/11 కేవీ సబ్ స్టేషన్ ను ప్రారం భించారు.వేసవికాలంలో పట్టణం లో విద్యుత్ కు ఎంతో డిమాండ్ ఉంటుందని, ఇక్కడ ప్రజలు ఏసీ లు, ఫ్యాన్లు వంటివి లేకుండా ఉం డలేని పరిస్థితిని అందువల్ల వీలై నంత ఎక్కువ సబ్ స్టేషన్లు ఏర్పా టు చేస్తున్నామన్నారు. కేవలం 100 రోజుల్లో బిటి మార్కెట్ విద్యుత్ సబ్ స్టేషన్ ను పూర్తి చేయడం పట్ల ఆయన విద్యుత్ శాఖ అధికారులను అభినం దించా రు. ఈ సబ్ స్టేషన్ తో పాటు, మునుగోడు రోడ్డు, దేవరకొండ రోడ్డు, పానగల్ సావర్కర్ శివాజీ నగర్ లో విద్యుత్ సబ్స్టేషన్లు ఏర్పాటు చేస్తే ఇక నల్గొండ పట్టణానికి ఎలాంటి అంతరాయం లేకుండా 24 గంటలు విద్యుత్ ను అందించవచ్చని ఆయన తెలిపారు. బ్రాహ్మణ వెళ్లేముల రిజర్వాయర్ ను నీళ్లతో నింపి కాలువల ద్వారా నీరు అందిస్తున్నందున ఆ ప్రాంతంలో విద్యుత్ కు మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉందని ,దీనిని దృష్టిలో ఉంచుకొని విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలన్నారు. వేసవికాలంలో పట్టణానికి ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఫీడర్‌ను ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ అధికారులు ఆదేశించారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చింది తమ ప్రభుత్వమేనని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
నల్గొండ మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగంగా సంవత్సరకాలంలో 500 కోట్ల రూపాయలు మంజూరు చేయించి తాగునీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సిసి రోడ్లు పనులు చేపట్టడం జరిగిందన్నారు. 11 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన 11 నీటి ట్యాంకులను నిర్మించడం జరుగుతున్నదని ,వచ్చే ఏప్రిల్ నుండి ప్రతి ఇంటికి ప్రతిరోజు కృష్ణ తాగునీటిని సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. వీటితోపాటు, అదనంగా 109 కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సిసి రోడ్లు పనులు చేపట్టనున్నామని, ఇందుకు వారం రోజుల్లో టెండర్లు పిలవనున్నట్లు తెలిపారు.
ఆదివారంతో మున్సిపల్ కౌన్సిల్ పదవి కాలం ముగియనున్నప్పటికీ జిల్లా కలెక్టర్, అధికారులు అలాగే ప్రస్తుత కౌన్సిల్ సభ్యులు అందరూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగాకుండా సేవలందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ రానున్న వేసవిలో ప్రజలకు ఎలాంటి విద్యుత్ అంత రాయం లేకుండా సేవలందిం చేందుకుగాను బీట్ మార్కెట్లో 33/11 కె వి సబ్‌స్టేషన్ ఏర్పాటు చేయడమే కాకుండా, అందులో అవసరమైన అన్ని రకాల సామా గ్రిని ఏర్పాటు చేశామని ఆమె తెలి పారు.అదనపు కలెక్టర్ జే. శ్రీనివా స్, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివా స్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమే ష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్, విద్యుత్ శాఖ సీఈ బాల స్వామి, ఎస్ ఈ వెంకటేశ్వర్లు, తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.