★ విపక్షాల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దు
★ నారయణపురం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు జాక్కిడి చంద్రా రెడ్డి
Chandra Reddy : ప్రజా దీవన,సంస్థాన్ నారాయణపురం : ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని నారాయణపురం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు జక్కిడి చంద్రారెడ్డి పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ఏ ఒక్కరికి ఒక్క ఇల్లు రేషన్ కార్డు కూడా ఇవ్వని గత ప్రభుత్వం నేడు ఓర్వలేక ప్రజలను పట్టిస్తున్నారు.
ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందే విధంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని తెలిపారు.6 ఆరు గ్యారంటీలతో ప్రజల కలను నెరవేర్చడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యమని అన్నారు.అర్హులైన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధి చేస్తుందని ప్రతిపక్షాలు ప్రజలని అయోమయానికి గురిచేసి తప్పు దోవ పట్టిస్తున్నారని ప్రజలను వీటిని నమ్మొద్దని తెలియజేశారు.ప్రతిపక్షాలు ఇకనైనా ఇలాంటి చర్యలు మానుకోవాలని ప్రతిపక్ష నాయకుల చర్యలను ఖండించారు.