మాదిగ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు ఊదరి రాకేష్ మాదిగ
Rakesh : ప్రజా దీవన, నారాయణపురం : ఆకాశమంత ఎత్తులో నిలబెట్టుకున్న అంబేద్కర్ విగ్రహం,76వ గణతంత్ర దినోత్సవం రోజున రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని బందీ చేసి అవమానించింది కాంగ్రెస్ ప్రభుత్వమని తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం చౌటుప్పల్ మండల అధ్యక్షులు ఊదరి రాకేష్ మాదిగ అన్నారు.ఈ నేపథ్యంలో చౌటుప్పల్ మండల కేంద్రంలో మాదిగ సంక్షేమ సంఘం భవన్ లో రాకేష్ మాదిగ మాట్లాడుతూ కనీసం పూలమాల వేయాలన్న సోయి కూడా లేని రేవంత్ రెడ్డి సర్కార్ అని ఈరోజు ప్రజలు నివాళులు ఆర్పించకుండా ఉండేలా చేసినది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకు ఇంత అవమాన పరుస్తున్నారు అని సీఎం రేవంత్ రెడ్డి మీరు వెంటనే ప్రజల సమక్షంలో క్షమాపణ చెప్పాలని పత్రిక ప్రకటన ద్వారా ఆయన డిమాండ్ చేశారు.
భారతదేశ ప్రజలందరికీ గణతంత్ర్య దినోత్సవ(భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు) శుభాకాంక్షలు తెలియచేస్తూ మహనీయుల అంశతో భారత దేశ ప్రజలందరికీ “భారత రాజ్యాంగం” ద్వారా హక్కులు, అధికారం, స్వేచ్ఛ జీవితాన్ని అందించిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భరతావని రుణపడి ఉంది అని ఈరోజు మనము కట్టే బట్ట,ఉండే గూడు,తినే తిండి ప్రతీ ఒక్కటీ బాబా సాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన భిక్షే అని యాది మరవొద్దు అని అసలు మనుషులుగా గుర్తించబడని,జంతువుల కన్నా హీనంగా చూడబడిన ప్రజల్ని ఈరోజు వొంటి మీద సూటు వేసుకొని,కార్లల్లో తిరుగుతూ ఉద్యోగాలు,వ్యాపారాలు చేస్తూ స్వేచ్ఛా జీవితాన్ని అనుభవిస్తున్నామంటే కారణం కేవలం బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన”భారత రాజ్యాంగం” అమలులోకి రావడం ద్వారా మాత్రమే.అందుకే మనందరికీ “భారత రాజ్యాంగమే శరణ్యం”.అని ఆయన అన్నారు.ఇప్పటి కైన ప్రభుత్వం మేల్కొని మహనీయుడు బాబా సాహెబ్ అంబేద్కర్ కి క్షమాపణ చెప్పి,పాలాభిషేకం చేసి గణ నివాళులు అర్పించాలి అని రాకేష్ మాదిగ ప్రభుత్వాన్ని పత్రిక ప్రకటన ద్వారా డిమాండ్ చేశారు.