*పెరిక కులస్తుల తో పాటు ఇతర కులాలకువిద్య, విజ్ఞానం కోసం పాటుపడతా: రాజేశ్
Rajesh : ప్రజా దీవెన, కోదాడ:పెరిక కులుస్తులతో పాటు వెనుక బడిన వర్గాలకు విద్యా, ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పెరిక హాస్టల్ అధ్యక్షులు డా llహసానబాద రాజేష్ తెలిపారు.ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పెరిక హాస్టల్ ప్రధాన కార్యదర్శి సుందరి వెంకటేశ్వర్లు సారధ్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని జాతీయ జెండాను ఎగరవేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ . పెరిక కుల పెద్దలు 40 సంవత్సరాల క్రితం ఉన్నత లక్ష్యాలతో పెరిక హాస్టల్ ఏర్పాటు చేసి ఈ ప్రాంత విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేశారని, వారి స్ఫూర్తితో కోదాడ ప్రాంతంలో పెరిక కులస్తులతో పాటు ఇతర చైతన్యవంతమైన విద్యార్థులకు విద్య, విజ్ఞానం, ఉపాధి అవకాశాలకు కావాల్సిన శిక్షణ తదితర సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. 76వ గణతంత్ర వేడుకల్లో పెరిక కళ్యాణ మండపం, పెరిక హాస్టల్ తీరుతన్నులపై, జరగవలసిన అభివృద్ధిపై సమీక్షించారు.
ఈ కార్యక్రమంలో పెరిక హాస్టల్ గౌరవ అధ్యక్షులు పాయిని కోటేశ్వరరావు, ఫౌండర్ మెంబర్ బుడిగం లక్ష్మీనారాయణ, కోదాడ మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, పెరిక హాస్టల్ ట్రెజరర్ గుండు అనురాధ మధు , కందుల లింగయ్య, రామినేని సత్యనారాయణ, దొంగరి శ్రీనివాస్, తిపరిశెట్టి శ్రీనివాస్, పాయిలి వెంకటనారాయణ, నిగిదాల వీరయ్య, మైలరీశెట్టి రమేష్, కొక్కు లక్ష్మినారాయణ జూకురి అంజయ్య, మాజీ జడ్పిటిసి పుల్లూరు అచ్చయ్య, బొలిశెట్టి కృష్ణయ్య, రామినేని శ్రీనివాసరావు, తోగరు రమేష్ అంకతి అప్పయ్య, చిత్తలూరి సత్యనారాయణ, పాయిలి జయరామయ్య కౌన్సిలర్లు కందుల చంద్రశేఖర్, కోట మధు, తీపిరి శెట్టి సుశీల రాజు, ముత్తినేని కోటేశ్వరరావు, తునం కృష్ణ, బుడిగం నరేష్, బుడిగం రాజేష్, బాదే రామ లింగయ్య, బుద్దే వంశీకృష్ణ, పత్తిపాక జనార్ధన్, బరపటి కోటేశ్వరరావు, బచ్చు శ్రీనివాస్, కొనకంచి వెంకటేశ్వర్లు, పత్తిపాక కృష్ణ వనం నాగేశ్వరరావు, కొనకంచి ప్రభాకర్, కిరణ్, కిషోర్, సైదులు తదితరులు పాల్గొన్నారు.