Palla Devender Reddy : ప్రజాదీవెన, నల్గొండ టౌన్ ఆన్లైన్ విధానం వల్ల భవనిర్మాణ కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తక్షణమే వారి సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లా దేవేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం నల్లగొండ ఏఐటియుసి కార్యాలయం గుండె రవి అధ్యక్షతన జరిగిన భవన నిర్మాణ కార్మికుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న సంక్షేమ బోర్డు ఈరోజు సమస్యల నిలయముగా మారిందని ఆరోపించారు .
గత ఆరు నెలలుగా కార్మికులకు డబ్బులు ఇవ్వడం లేదని ఆన్లైన్లో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా పరిష్కరించడంలో లేబర్ డిపార్ట్మెంట్ వైఫల్యం చెందిందని ఆరోపించారు. కార్మికులు రోజుల తరబడి లేబర్ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ఆన్లైన్ అప్డేట్ పేరుతో గత ఆరు నెలలుగా కార్మికులను ఆఫీస్ చుట్టూ తిప్పుకుంటూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కార్మిక సంక్షేమ బోర్డులో జమ కావాల్సిన సెస్సు సక్రమంగా వసూలు చేయకపోవడం వల్ల కార్మిక సంక్షేమ నిధులు పెరగడం లేదని అన్నారు.
సంక్షేమ బోర్డులో కార్మిక సంఘాలకు ప్రాతినిథ్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు మెడికల్ చెకప్ ల పేరుతో జరుగుతున్న ఆర్థిక దోపిడి పై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. ఏప్రిల్ లో శంషాబాద్ లో జరిగే రాష్ట్ర మహాసభ జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఫిబ్రవరి నెలలో మండల జిల్లా మహాసభలు పూర్తి చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు కె ఎస్ రెడ్డి జిల్లా కోశాధికారి డి వెంకన్న భవనిర్మాణ కార్మిక సంఘం నల్లగొండ పట్టణ అధ్యక్షులు గుండె రవి కార్యదర్శి రేవెల్లి యాదయ్య, కోశాధికారి జి నరసింహ నాయకులు పుల్లారావు,యాదయ్య లింగయ్య,వెంకన్న, భాష అంజయ్య పాండు లింగయ్య, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.