Thomson Jos : ప్రజా దీవెన,తిరువనంతపురం: తిరువనంతపురం సెంట్రల్ స్టేడి యంలో జరిగిన గణతంత్ర దినో త్సవ కవాతులో నగర పోలీసు కమిషనర్ థామ్సన్ జోస్ కుప్ప కూలిపోయారు. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కవాతును ఉద్దే శించి ప్రసంగిస్తుండగా ఈ సంఘటన జరిగింది.
కమిషనర్ గవర్నర్ దగ్గర నిలబడి ఉన్నారు. వివిధ సాయుధ దళాల నుండి గౌరవ వందనం స్వీకరించిన తర్వాత గవర్నర్ ప్రసంగించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు సమీపంలో నిలబడి ఉన్న కమిషనర్ కుప్పకూలిపో యారు. ఆయన ముందుకు పడి పోవడంతో ఆయన సహచరులు అంబులెన్స్‌కు తరలించారు. చికి త్స పొందిన తర్వాత ఆయన తిరిగి వచ్చారు.
Police commissioner downfall in republic day celebrations pic.twitter.com/0ssfiqHsJT
— praja deveena web site and digital edition e paper (@PDeveena40655) January 27, 2025